పార్వతీపురంలో వామపక్షాల రహదారి దిగ్బంధం: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ రాస్తారోకో.. స్తంభించిన రవాణా!

Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధరల పెంపును నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)
Published on: 9 Jun 2026 8:31 PM IST
పార్వతీపురంలో వామపక్షాల రహదారి దిగ్బంధం: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ రాస్తారోకో.. స్తంభించిన రవాణా!
X

పార్వతీపురంలో వామపక్షాల రహదారి దిగ్బంధం: ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ రాస్తారోకో.. స్తంభించిన రవాణా!

పార్వతిపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్ ,గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలనీ డిమాండ్ చేస్తూ పార్వతీ పురం ఆర్ టి సి కాంప్లెక్స్ వద్ద వామ పక్షాల ఆద్వర్యంలో రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, మోడీ యుద్ధం వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ , గ్యాస్ ధరలు పెంచము అని అంటూనే యుద్ధం అనంతరం రోజుకోలాగా పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని వంటగ్యాస్ ధర ఆకాశానికి అంటిందని అన్నారు మోడీ ,కేంద్ర ప్రభుత్వం ట్రంప్ చెప్పినట్లు వినడం వల్ల ట్రంప్ కు లొంగిపోవడం వల్ల ఇరాన్ నుంచి రష్యా నుంచి చమరు దిగుమతి చేసుకోకపోవడం వలన చమరు ధరలు పెరుగుతున్నాయని అన్నారు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగకపోయినప్పటికీ మన దేశంలో ,రాష్ట్రంలో మాత్రం కార్పొరేట్ పెట్టుబడుదారులకు లాభాలు వచ్చే విధంగా మోడీ ప్రతిరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచుతున్నారని ఈ ధరలు పెరగడం వలన నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పేదలు బ్రతక లేని పరిస్థితి లో ఉన్నారని కాలకృత్యాలు అన్నారు.

వాణిజ్య వంటగ్యాస్ ధర పెరగడం వలన హోటలలో టిఫిన్లు, భోజనాలు ధరలు విపరీతంగా పెరిగాయని ఈ ధరలు పెరగడానికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ పెట్టుబడుదారులతో కొమ్మక్కై కార్పొరేట్ లాభాల కోసం ప్రతిరోజు చమురు ధరలు పెంచుతున్నారని వీటికి వ్యతిరేకంగా ప్రజలంతా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కుమార్ గారు, పువ్వుల ప్రసాద్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కోల్లి గంగు నాయుడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గొర్లి వెంకటరమణ, రెడ్డి వేణు, కొల్లి సాంబమూర్తి గారు, ఐద్వా జిల్లా కార్యదర్శి బొత్స లక్ష్మి సిఐటియు నాయకులు సూరిబాబు, యువజన నాయకులు పి. రాజశేఖర్, సిపిఐ (ఎం. ఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పి రమణి, రైతు కూలీ సంఘం నాయకులు శ్రీనునాయుడు, ఎం. భాస్కర్ రావు, సిపిఐ (ఎం. ఎల్) లిబరేషన్ నాయకులు పి.సంఘం పాల్గొన్నారు.

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

B.PRASAD, PARVATHIPURAM (MANYAM)

Next Story