Guduru: గూడూరులో అక్రమ మట్టి దందా.. అధికారుల అండదండలు!

Guduru: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అక్రమ మట్టి దందా జోరుగా సాగుతోంది.

B NARASIMHA, GUDUR
Published on: 24 May 2026 10:13 AM IST
Guduru
X

Guduru: గూడూరులో అక్రమ మట్టి దందా.. అధికారుల అండదండలు!

గూడూరు: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లో అక్రమ మట్ట దందా జోరుగా సాగుతోంది.మండలం లో వ్యవసాయ భూములను రియల్ ఎస్టేట్ భూములుగా మార్చి విక్రయిస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ భూములలో అక్రమంగా గ్రామ చెరువుల నుండి మట్టిని తరలిస్తున్నారు. వీటితోపాటు రోడ్డు కాంట్రాక్టర్లకు చెరువు మట్టిని జోరుగా విక్రయిస్తున్నారు.మండలం లో దామరవంచ గ్రామ ఊర చెరువు లో 15 రోజులుగా జెసిబిల సాయిహంతో అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు.

తమ చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తూ చెరువును ఆగం చేస్తున్నారు అని స్థానిక రైతులు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని గ్రామస్తులు తెలిపారు. అధికారులు వస్తున్నారు వారి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని దామరవంచ గ్రామస్తులు తెలిపారు.

అధికారుల అండదండలతో ఊర చెరువును చెరబడుతున్న వైనం

గూడూరు మండలంలోని గోవిందపురం, దామరవంచ, గూడూరు గ్రామాల చెరువులలో అక్రమ మట్టి నిలిపివేయాలని అధికారులను పలుమార్లు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదు అంటూ గ్రామస్తులు తెలిపారు. ఈ అక్రమ మట్టి రవాణాకు పరోక్షంగా అధికారులు అండదండల అందిస్తున్నారు అని అధికారుల సహకారంతో ఈ అక్రమ మట్టి రవాణా జరుగుతుందని ఆరోపించారు.

రాత్రింబవళ్లు టిప్పర్లతో జోరుగా మట్టిదందా

గూడూరు గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చెరువులలో రాత్రింబవళ్లు టిప్పర్ల సహాయంతో అక్రమ మట్టిని తరలిస్తున్నారు. ఈ ఆక్రమం మట్టి రవాణాలను అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

తహశీల్దార్ కార్యాలయం పక్కనే అక్రమ మట్టీ దందా

బ్రహ్మణపల్లి గ్రామ శివారు తహసిల్దార్ కార్యాలయం పక్కన ఉన్న కోటి చెరువులో రాత్రుళ్ళు టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం కూత వేటు దూరంలోనే అక్రమ మట్టిని తరలిస్తున్నారు.అక్రమ మట్టి రవాణా అడ్డుకట్ట వెయ్యవలసిన అధికారుల పక్కనే మట్టి రవాణా జరగడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

చెరువులను తవ్వడం తో పొంచివున్న ప్రమాదం

అనుమతి లేకుండా ఊర చెరువు లలో అక్రమ మట్టి తవ్వకాలతో భారీ గుంతలు ఏర్పడడం వల్ల ఆ గుంతలలో పశువుల కాపరులు, గిరిజన రైతులు పడి మృతి చెందిన సంఘటన అనేకం గా ఉన్నాయి.గత కొన్ని రోజుల క్రితం గాజులగట్టు గ్రామంలో కంచ సునిల్ అనే గొర్ల కాపరి తన గొర్రె జేసిబి తిసిన గుంతలో పడిపోవడంతో ఆ గొర్రెను తిసే క్రమం లో గుంతలో పడి మృతి చెందాడు.రాములతండ గ్రామ శివారులో ఉన్న చెరువు లో తన మనవడితో కలిసి చేపల వేటకు వెళ్లిన నరసింహ అనే వ్యక్తి జేసిబి తిసిన గుంతలో పడి మృతి చెందారు. అక్రమం మట్టి నిర్లక్ష్యం వల్ల ఇటువంటి మరణాలు జరుగుతున్నాయని, ఇటువంటి మరణాలకు ప్రధానంగా ఆక్రమ మట్టి రవాణా కారణమని స్థానికులు తెలిపారు.

అక్రమ మట్టి రవాణాలు అరికట్టాలి

మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా పూల చెరువులను చరబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని అక్రమ మట్టి రవాణాలను అరికట్టాలని సారి కొన్ని కోరుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ ఆ చట్టాన్ని తమ చేతిలో తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story