Jangaon: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృషి ఫలించింది.. మైనింగ్ అనుమతులు రద్దు!

Jangaon: జనగామ జిల్లాలో వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద అక్రమ మైనింగ్ అనుమతులను రద్దు చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.

S MAHENDER, PALAKURTHI
Published on: 9 Jun 2026 1:57 PM IST
Jangaon
X

Jangaon: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కృషి ఫలించింది.. మైనింగ్ అనుమతులు రద్దు!

జనగామ జిల్లా: వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట మైనింగ్ అనుమతులను రద్దు చేసిన జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాని కలిసి వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ ఫిర్యాదుపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ చేపట్టగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

విచారణలో కీలక అంశం:

విచారణ సందర్భంగా లీజుదారు స్వయంగా ధర్మాపురం గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని అంగీకరించారు.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అత్యంత కీలక ఆధారంగా పరిగణించారు.

గుర్తించిన ఇతర లోపాలు:

20-11-2018న జారీ చేసిన రెవిన్యూ NOCకు సంబంధించి తహసీల్దార్ కార్యాలయంలో నోట్ ఫైల్,సంబంధిత రికార్డులు లభించలేదు.గ్రామ పంచాయతీ అనుమతి లేకపోవడం. రెవిన్యూ NOCకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడం.ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సంబంధిత క్వారీ లీజును రద్దు చేసే దిశగా జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వానకొండయ్య లక్ష్మీనరసింహస్వామి గుట్ట పరిరక్షణ కోసం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన కృషి ఫలించింది.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story