Gangaram: చేతికొచ్చిన 9 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి!

Gangaram: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం బోరుగొండ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది.

B NARASIMHA, GUDUR
Published on: 24 May 2026 3:01 PM IST
Gangaram
X

Gangaram: చేతికొచ్చిన 9 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి!

గంగారాం: నాలుగు నెలలు కష్టపడి పండించగా,చేతికి వచ్చిన మొక్కజొన్న పంట క్షణాల్లో కాలి బూడిద అయిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది.గంగారం మండలం బోరుగొండ గ్రామానికి చెందిన బొజ్జ జంపయ్యకు సంబంధించి ఐదు ఎకరాలు, చెంచు పాపయ్యకు చెందిన నాలుగు ఎకరాల మొక్కజొన్న పంట ఆరబోశారు. దిగుబడి బాగా వచ్చిందని అమ్ముకొని సొమ్ము చేసుకుందామనుకున్నారు.

కానీ ప్రమాదవశాస్తూ గాలికి ఎగిరి వచ్చి పడ్డ నిప్పు రవ్వలు ఒక్కసారిగా వ్యాపించి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో తొమ్మిది ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదయ్యింది. గత సంవత్సరం కూడా పొలాల్లో ఆరబోసిన పంట అగ్నికి ఆహుతి అయిందని, ఈసారి కూడా ఆ అగ్ని దేవుడు మా మీద పగ పట్టినట్టు 9 ఎకరాల పంటను బుగ్గిపాలు చేసిందని కన్నీరు మున్నీరవుతున్నారు బాధిత రైతులు. చేతికి వచ్చిన పంట పూర్తిగా కాలిపోవడంతో రెండు కుటుంబాలలో రోదనలు మిన్నంటాయి. జంపయ్య, పాపయ్య కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story