Palakurthi: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: పాలకుర్తి, రాయపర్తి సంఘాలకు కొత్త బస్సులు.. జెండా ఊపిన ఎమ్మెల్యే!
Palakurthi: పాలకుర్తి, రాయపర్తి మండలాల ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.36 లక్షల విలువైన నూతన బస్సులను స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి సోమవారం జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
Palakurthi: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం: పాలకుర్తి, రాయపర్తి సంఘాలకు కొత్త బస్సులు.. జెండా ఊపిన ఎమ్మెల్యే!
పాలకుర్తి: పాలకుర్తి మండల కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి పాలకుర్తి సంఘానికి మరియు రాయపర్తి మండలాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 1 బస్సుకు రూ.36 లక్షల విలువైన నూతన బస్సులను స్థానిక శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సంఘాలు బలోపేతం కావడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘానికి అందించిన ఈ బస్సు మహిళల సేవా కార్యక్రమాలకు, సంఘ కార్యకలాపాలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
అనంతరం బస్సుకు పూజలు నిర్వహించి ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




