వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి

Raj
By Raj
Updated on: 9 Sept 2019 12:45 PM IST
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి
X

ప్రకాశం జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన కనిగిరిలో జరిగింది. పాతూరులో నివాసముంటున్న ప్రసన్న కుమారి ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని విగతజీవిగా కనిపించింది. ప్రసన్నకుమారికి... ప్రేమసాగర్‌కి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇటీవలే భర్తతో విబేధాలు రావడంతో ప్రసన్న కుమారి పుట్టింటికి వచ్చింది. అయితే ఇంట్లో ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి..కూతురు ఉరి వేసుకుని విగతజీవిగా పడివుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అల్లుడే..తన కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృత్యురాలి తల్లి ఆరోపిస్తుంది. మృత్యురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Raj

Raj

Next Story