Top
logo

దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

14 Days Remand To Devineni Umamaheswara Rao
X

దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్

Highlights

Devineni Umamaheswara Rao: మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు.

Devineni Umamaheswara Rao: మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ నుంచి భారీ భద్రత మధ్య దేవినేని ఉమను హనుమాన్ జంక్షన్ తరలించారు. జూమ్ యాప్ ద్వారా వర్చువల్ గా మైలవరం కోర్టు జడ్జి ఎదుట ఉమాను హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. రాజమండ్రి జైలుకు తరలించాలని ఆదేశించారు. దేవినేని ఉమను అరెస్ట్ చేసిన తర్వాత ఉదయం ఆరు గంటలకు నందివాడ పోలీస్ స్టేషన్ తీసుకు వచ్చారు. భారీ బందోబస్తు మద్య దేవినేని ఉమాను కోర్టుకు తరలించారు.

Web Title14 Days Remand To Devineni Umamaheswara Rao
Next Story