2025 AP Political Round Up: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు

2025 AP Political Round Up: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు
x
Highlights

2025 AP Political Round Up – ఏడాది పొడవునా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న కీలక పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, విపక్ష రాజకీయాలు, ఎన్నికల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.

నారా చంద్రబాబు నాయుడు. ఈ పేరు వింటే ఓ పట్టుదల రూపం కళ్ళ ముందు కదలాడుతుంది. ఓటమిలో కూడా విజయం కోసం పోరాడే స్ఫూర్తి ఆయన సొంతం. ఇప్పుడు ఆయన దృష్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ ను ప్రగతి పదం వైపు నడిపించడం పైనే పెట్టారు. అందుకు అనుగుణంగా ఈ ఏడాది మొదటి నుంచే ఆయన కృషి మొదలు పెట్టారు. ప్రాధాన్యత క్రమంలో ఏపీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అంతే ఆ ప్రణాళిక మేరకే పరుగులు మొదలుపెట్టారు. వైసపి పాలనలో అస్తవ్యస్తంగా మారిన పాలన అదుపు తప్పి అతిగా వ్యవహరించిన అధికారులు జవాబుదారితనం లేని కింది స్థాయి సిబ్బంది స్వేచ్ఛ లేదనే వేదనలో ఉన్న ప్రజానీకం. ఇలా అన్ని వ్యవస్థలు చంద్రబాబుకు ఓ సవాలుగా నిలిచాయి. అన్నింటిని తిరిగి ఓ గాడిద పెట్టి అంశంపై దృష్టి పెట్టిన చంద్రబాబు ఈ ఏడాది కాలం ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా అలుపెరగని శ్రామికుడిలా పని చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు ఏపీ సీఎం గా రెండోసారి పగ్గాలు చేపట్టే నాటికి ఆయన ఆశల సౌధం ఏపీ రాజధాని అమరావతి ఆనవాలు లేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అమరావతి పునర్నిర్మాణం జరిగితే తప్ప ఏపీ కి భవిష్యత్తు లేదని అంచనా వేసిన చంద్రబాబు దాని నిర్మాణంపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించారు. 2014 2019 మధ్యకాలంలో అమరావతిలో నిర్మించిన భవనాలు నిర్మాణం దశలోనే నిలిచిపోయి సిధిలావస్థకు చేరుకున్న భవనాలు అమరావతిలో ఇంకా సాగించవలసిన అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా పరిశీలించిన చంద్రబాబు వాటిపై శ్రద్ధ పెట్టారు. ఈ ఆలోచన ఇప్పుడు ఓ కార్యరూపం దాల్చుతోంది. ఏడాది కాలంలో అమరావతి రూపం మారుతూ వస్తోంది. అసమర్థత పాలనలో హీనంగా కనిపించిన భవనాలు ఇప్పుడు కొత్త కళ సంతరించుకుంటున్నాయి. అమరావతి రాజధానికి శంకు స్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోదీనే అమరావతి పునర్నిర్మాణం పనులకు శంకు స్థాపన చేసి కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం అందించడంతో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇప్పుడు వేగంగా జరుగుతోంది. ఇది ఏపీ ప్రజలకు ఊరట ఇవ్వడంతో పాటు చంద్రబాబు దక్షతకు ఓ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటే చంద్రబాబుకు ఆరో ప్రాణం ఇందులో ఎటువంటి సందేహం లేదు. అమరావతి నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలించడం వేగంగా సాగే దిశగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడంలో అమరావతి నిర్మాణ పనుల పర్యవేక్షణ బాధ్యతను మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు అప్పగించారు. సిఆర్డిఏ అధికారులు కూడా అమరావతి నిర్మాణంలో ఇప్పుడు నిబద్ధత కనబరుస్తున్నారు. ఏడాది కాలంలో అమరావతి నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపించడం ఏపీ ప్రజలకు రాజధాని రైతులకు సంతృప్తిని ఇస్తోంది. అమరావతి రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అంత ఉద్యమ స్ఫూర్తి రాజధాని రైతులకు ఉంది. అమరావతి నిర్మాణం కోసం రాజధాని రైతులు సాగించిన పోరాటం పడిన ఆరాటం సాగించిన ఉద్యమం పడిన కష్టం ఎదుర్కొన్న నష్టం అనుభవించిన ఆటుపోట్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నది అక్షర సత్యం. ఇప్పుడు రూపుదిద్దుకుంటున్న అమరావతి రాజధానిని చూసి అక్కడి రైతులు పడుతున్న ఆనందం అంతా ఇంతా కాదు. ఇక టిడిపి బిజెపి జనసేన కూటమి ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం చకచక ఆకృతి దిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అమరావతి నిర్మాణం అత్యంత వేగంగా జరిగే విధంగా ప్రయత్నం చేయడంతో ఈ ఏడాది అమరావతికి శుభసూచకంగా మారింది. అధికారిక అనధికారిక భవనాలు పూర్తవుతూ 2028 చివరి నాటికి అమరావతి రాజధాని పూర్తి స్థాయి రూపం సంతరించుకునేందుకు బడిబడిగా అడుగులు వేస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం ఓ మహా యజ్ఞం అసలు ఈ సంకల్పమే ఓ సాహసం లక్షల కోట్ల వ్యయంతో ఇది ముందుకు సాగాల్సిన లక్ష్యం ఇంతటి మహోత్తర కార్యం చంద్రబాబుతోనే సాధ్యం అంటారు మేధావులు అమరావతి రాజధాని నిర్మాణంపై కేంద్రం కూడా దృష్టి పెట్టడం ఓ శుభ పరిణామం డబుల్ ఇంజన్ సర్కార్ అమరావతి నిర్మాణానికి కలిసివచ్చే మరో అంశం 2025 ఏడాది ఆరంభం నుంచి ఎప్పటికప్పుడు అమరావతి నిర్మాణ పనులు నిశ్చితంగా పరిశీలించి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ నిర్మాణాల వేగం పెంచుతున్న చంద్రబాబు కేంద్రం నుంచి ప్రపంచ బ్యాంకుల నుంచి అవసరమైన ఆర్థిక సహాయం పొందడంలో సక్సెస్ అవుతూ వచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు కల మాత్రమే కాదు ఏపీ ప్రజల ఆత్మగౌరవం దీన్ని సాధించే ప్రక్రియ ఇప్పుడు చంద్రబాబు తన భుజాలపై వేసుకున్నారు. ఈ ఏడాదిలో అనుకున్న స్థాయిలో లక్ష్య సాధన దిశగా పరుగులు తీశారు. ఏపీ పునర్నిర్మాణంలో సీఎం చంద్రబాబుకు మరో ప్రాధాన్యత అంశం పోలవరం ప్రాజెక్ట్ దీన్ని పూర్తి చేయాలనే సంకల్పం ఆయన గట్టిగానే తీసుకున్నారు. వైసపి ప్రభుత్వ హయాంలో నిలువెత్తు నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడిన పోలవరం ప్రాజెక్ట్ పనులను ఇప్పుడు ఆయన గాడిలో పెట్టడంతో పాటు పనులను వేగంగా పూర్తి చేయించడానికి వ్యూహరచన చేశారు. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన సహాయ సహకారాలు ప్రణాళిక మేరకు తీసుకొని ఈ ఏడాదిలో ప్రాజెక్టుకు ఓ రూపం తెచ్చేందుకు చేసిన ప్రయత్నం చాలా మేరకు సక్సెస్ అయింది. మరోవైపు మల్లన్న సాగర్ నిర్మాణంపై కూడా లోతుగా ఆలోచనలు చేస్తున్నారు. నిర్మాణం వ్యయం తడిసి మోపడైన నేపథ్యంలో వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ పనులు పరుగులు పెట్టేలా చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు న్యాయం చేయడం ఇతర సమస్యలు పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. పోలవరం పై వస్తున్న విమర్శలు ఆరోపణలు పక్కన పెట్టి నిర్మాణం పైనే ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2027 28 లోగా ప్రాజెక్టు పనులను పూర్తి చేసే విధంగా చంద్రబాబు పక్కా స్కెచ్ వేశారు. ఈ ఏడాది పోలవరం ప్రాజెక్టుకు మంచి రోజులనే స్థాయిలో ప్రజలకు నమ్మకం కలిగించారు. అమరావతి, పోలవరం ఏపీ కి రెండు కళ్ళు ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అభివృద్ధి కూడా చంద్రబాబుకు అత్యంత ప్రాధాన్యత అంశాలు. దీన్ని ఆయన గుర్తించారు. అన్ని ప్రాంతాలు సమానంగా ప్రగతి సాధించాలని అప్పుడే ఏపీకి సమగ్ర న్యాయం జరుగుతుందని పదే పదే తన సహచర మంత్రులకు గుర్తు చేసే సీఎం చంద్రబాబు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది ఏపీ లోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని మేధావుల టాక్ ముఖ్యంగా కరువు సీమగా పేరు తెచ్చుకున్న రాయలసీమలో వ్యవసాయం పరిశ్రమలు ఉపాధి కల్పన వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ 2025లో వాటిని ముందుకు నడిపించారు. రాయలసీమకు పోలవరం ద్వారా గోదావరి జిల్లాలు తరలిస్తే తప్ప అక్కడ కరువు సమస్య తీరదని లోతుగా గుర్తించిన చంద్రబాబు ఆ దిశగా భగీరథ ప్రయత్నం కార్యరూపం దాల్చే ఆలోచనలకు అంకురార్పణ చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉపాధి అవకాశం మెరుగుపడే విధంగా నిర్మాణాత్మక పనులు చేపట్టారు. ఈ ఏడాదిలో వీటికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు వచ్చే రెండేళ్లలో వాటి ఫలాలు ప్రజలకు అందేలా కృషి మొదలు పెట్టారు. ఏపీకి గుండెకాయ వంటి విశాఖపట్నం అభివృద్ధి ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. అందరినీ ఆకట్టుకునే స్థాయిలో విశాఖపట్నం రూపురేఖలు మున్ముందు మారతాయి అనడంలో సందేహం లేకుండా సీఎం చంద్రబాబు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ప్రపంచం దృష్టి విశాఖపట్నం పై పడే స్థాయిలో బిజినెస్ పరమైన సదస్సులు ఇక్కడ నిర్వహించడం ద్వారా ఏపీలో పెట్టుబడులు ఇతోధికంగా రాబట్టిన చంద్రబాబు విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగుపరిచే అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.గగు గూగుల్ వంటి భారీ సంస్థలు పెట్టుబడులు పెట్టే పరిస్థితి విశాఖకు కల్పించి అగ్రస్థాయి పరిశ్రమల దృష్టి సాగర తీరంపై పడేలా చేయడంలో నారావారు సక్సెస్ అయ్యారు. చంద్రబాబు రెండోసారి ఏపీ సీఎం గా అధికార పగ్గాలు చేపట్టే సమయానికి అత్యంత దుర్భర స్థితిలో ఉండే రహదారులు ఆయనకు సవాలు విసిరాయి. ప్రజలకు నిత్యం నరకం చూపే తరహాలో మారిన రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించాలనే గట్టి సంకల్పం తీసుకొని ముందుకు సాగారు. చంద్రబాబు ఆలోచనలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం కూడా తోడైంది. ఏపీ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్డు కష్టాలు తీర్చి అక్కడి ప్రజలకు డోలే ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్న చంద్రబాబు పవన్ ఆ తరహాలో రోడ్డు మరమతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. కేంద్ర సహకారంతో జాతీయ రహదారులు ఇతర రోడ్ల నిర్మాణాలు ఈ ఏడాది ఓ క్రమ పద్ధతిలో సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2025లో మరో మచ్చు తొరకగా ప్రగతి సాధించిన అంశాల్లో విద్యా వ్యవస్థ ఒకటి ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా వ్యవస్థ వరకు సమూవుల మార్పులు చేయటం విద్యా వ్యవస్థలో విలువలు పెంచడంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇది ఓ ఉద్యమంలా ఈ ఏడాది సాగుతూ వచ్చింది. చదువులతో పాటు విలువలు, సామాజిక స్పృహ, బాధ్యత భావితరాలు గుర్తించే రీతిలో ఏపీ విద్యా వ్యవస్థ సాగటం ఓ సంచలనమే. విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రుల ఆలోచనలో ఇది మార్పులు తీసుకొని వచ్చిందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ప్రపంచంలో మొదలైన కొత్త టెక్నాలజీ ఏఐ విధానంపై అందరూ అవగాహన పెంచుకోవాలని పదే పదే గుర్తు చేస్తున్న ఏపీ సీఎం హార్డ్ వర్క్ కన్నా ఇప్పుడు స్మార్ట్ వర్క్ అవసరం ఎంత ముఖ్యమో స్పష్టంగా చెప్పేస్తున్నారు. మొత్తానికి గడిచిన 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఇటు వ్యవసాయం అటు పారిశ్రామిక విద్య వైద్య మౌలిక సదుపాయాలు ప్రగతి అభివృద్ధి విషయాల్లో మంచి పురోగతి సాధించిన రాష్ట్రంగా నిలుస్తోంది. మనసుంటే మార్గం ఉంటుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అక్షరాల ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఆచరణలో పెడుతున్నారు. సువిశాల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగంలో నిలపడం సిబిఎన్ లక్ష్యం ఆ మేరకు 2025లో చంద్రబాబు ముందుకు సాగారు. ఇక ఇప్పుడు ఆయన పనుల్లో వేగం అధికారుల్లో జవాబుదారితనం పెంచే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ను ఐటీ రంగంలో పరుగులు పెట్టించిన చంద్రబాబు అనుభవం ఇప్పుడు ఏపీ అభివృద్ధికి అత్యంత కీలకంగా మారింది. అనుకున్నది సాధించే నైజం ఉన్న చంద్రబాబు ఎక్కడా రాజీ పడకుండా ఎలాంటి ఇబ్బంది రాకుండా 2025 లో పాలన సాగించారు. ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం రెండు అమలు చేయడం ఆయనకే సాధ్యమయింది. అయితే చంద్రబాబుతో పాటు అదే స్థాయిలో మంత్రులు కూడా పని చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడే ఏపీ అనుకున్న లక్ష్యం వైపు మరింత వేగంగా అడుగులు వేస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇవి 2025 లో ఆంధ్రప్రదేశ్ సాధించిన కొన్ని విజయ సూచికలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది రెండో సంవత్సరం ఎన్నికల ఫలితాల ఉత్సాహం ముగిసి ప్రమాణ స్వీకారాల సందడి తగ్గిపోయిన తర్వాత పాలనపరంగా పూర్తిగా పరీక్షకు నిలిచింది 2025వ సంవత్సరం. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది రాజకీయాలు హామీల చుట్టూ తిరగలేదు సరి కదా ఫలితాల చుట్టూనే తిరిగాయి. ముఖ్యంగా ఏపీ ప్రజలు ఏ నాయకుడి మాట వినలేదు. ప్రతి విషయాన్ని గమనించారు. ఎవరికీ చప్పట్లు కొట్టలేదు. ఆయా పార్టీల వారీగా పూర్తిగా లెక్కలు వేశారు. ఇది ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ కాదు. ప్రతిపక్షానికి అల్లకల్లోల పీరియడ్ అంతకన్నా కాదు కానీ ఈ ఏడాది మాత్రం పనితీరును పరీక్షించి ఓపికను అంచనా వేసిన సంవత్సరం అని చెప్పక తప్పదు. కూటమిలో ఉన్న ప్రతి పార్టీకి తన బలం ఎంత తన బలహీనత ఎక్కడ అన్నది అర్థమయ్యేలా ఈ ఏడాది చేసిందని చెప్పాలి. ఈ ఒక్క ఏడాది రాజకీయాలను వెనక్కి తిరిగి చూస్తే జయాపజయాలు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి ప్రతి పార్టీకి ఎదురవుతోంది. 2025లో కూటమి ప్రభుత్వంలో అసలైన భారాన్ని మోపింది తెలుగుదేశం పార్టీ అని చెప్పక తప్పదు. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న పార్టీగా ప్రజల అంచనాల్ని ప్రధానంగా ఒక్క టిడిపి మీదే కేంద్రీకృతమయ్యాయి అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఈ ఏడాది టిడిపి సాధించిన అతిపెద్ద జయం పాలనపై పట్టు బిగించడమే గాడి తప్పినట్లు ఉన్న పార్టీ వ్యవస్థను మళ్ళీ పట్టాలఎక్కించడం టాప్ గేర్లో పరిగెత్తేలా మరమ్మత్తులు చేయడం అంత ఆశామాషి విషయం కాదు. ఆర్థిక క్రమశిక్షణకు చేసిన ప్రయత్నం అడ్మినిస్ట్రేషన్ లో డిసిప్లిన్ నిర్ణయాల్లో స్పష్టత ఇవి టిడిపి కి ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. కానీ ప్రజలు కోరుకున్నది కేవలం క్రమశిక్షణ మాత్రమే కాదు నిర్మాణంలో వేగం కావాలి. అంతకుమించి సత్వర ఫలితం కావాలి. గ్రౌండ్ లెవెల్లో మార్పు కనిపించాలి. ఇక్కడే టిడిపికి కొన్ని వర్గాల నుంచి విమర్శలు లేకపోలేదు. హామీల అమలు నెమ్మదిగా ఉందన్న భావన రోజు రోజుకి బలపడుతోందన్న ప్రచారము లేకపోలేదు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఏడాది టిడిపి కి జయం అంటే పాలనపై పట్టు సాధించడం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని ఈ ఏడాది నెరవేర్చడం ఆర్థిక పరిస్థితితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం ఆర్థిక వృద్ధి రేటును పెంచడం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం నూతన పరిశ్రమల రాక పెట్టుబడుల కోసం నిర్వహించిన ప్రతి కార్యక్రమం విజయవంతం కావడం ఇవన్నీ టిడిపి కి పాలనపరంగా విజయాలనని చెప్పక తప్పదు. ఇక అపజయాల గురించి చెప్పాల్సి వస్తే గ్రౌండ్ లెవెల్లో ఆశించినంతగా స్పీడ్ లేకపోవడం అందుకే పాలనపరంగా మార్పులు వచ్చినా ప్రజా సంతృప్తి ఇంకా పూర్తి స్థాయిలో లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరో కీలకాంశం ఏంటంటే 2025లో టిడిపి రాజకీయ పార్టీలా కాకుండా పూర్తిగా పాలనా పార్టీలా వ్యవహరించిందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. ప్రచారం తగ్గించడమే కాక ప్రతి విమర్శలను లైట్ గా తీసుకుంటూ పాలన పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇది పాలన పరంగా సరైన దిశే అయినా రాజకీయంగా కొంత గ్యాప్ ఏర్పడిందన్న బాధన కూడా వినిపిస్తోంది. 2025లో టిడిపి నిలబడి సత్తా చాటింది. నిర్మాణాత్మకంగా కాస్త తడబడిన ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పొచ్చు. అందుకే మూడో ఏడాదిలోకి అడుగు పెట్టే ముందు ఇదే స్టైల్ కొనసాగాలా గేర్ మార్చాలా అన్నదే టిడిపి ముందున్న అసలైన ప్రశ్న. నాయకుడు సమర్థుడు అయితే క్యాడర్ కూడా బలంగా ఉంటుంది. టీడిపి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. పార్టీ రివ్యూ మీటింగ్లలో ఎవరు ఎలా పని చేస్తున్నారు? ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎంత మేరకు చేరుతున్నాయి ప్రజల అభిప్రాయం ఏంటి అనే అంశాలు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడం కింది స్థాయి నేతలు కార్యకర్తల సూచనలు అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడంలో టీడిపి ప్రత్యేక శ్రద్ధ పెట్టిందనే చెప్పాలి. టీడిపీ కి ఎప్పుడూ అండగా నిలిచే బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఆ పార్టీ హై కమాండ్ వైసపి కంచుకోటలా భావించే కడపలో మహానాడు నిర్వహించి తన బలం చాటుకుంది. పార్టీ క్యాడర్ ఎప్పుడు ఏం చేయాలి ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి భవిష్యత్ ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలి అనే అంశాలపై చంద్రబాబు లోకేష్ నిర్మాణాత్మక సూచనలు చేస్తూ వస్తున్నారు. వైసపి హయాంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి అండగా ఉండటం పార్టీ పరమైన అన్ని విషయాలు కింది స్థాయి కార్యకర్తల వరకు చేర్చడం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవడం సోషల్ మీడియాలో యక్టివ్ గా ఉండటం కార్యకర్తలకు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం ఇలా అన్ని అంశాల్లో టీడిపి ఓ అడుగు ముందుకువేసింది. పార్టీలో కష్టపడే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందనే సంకేతం ఇచ్చేలా ఈ ఏడాది టీడిపి అగ్రనాయకత్వం ముందుకు సాగింది. టిడిపి పార్టీ పరంగా చూస్తే ఇప్పటివరకు అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పించింది. క్యాడర్ లో ఉత్సాహం నింపేలా అనేక కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ ను కార్యకర్తలు కలవడానికి అధిక ప్రాధాన్యతని ఇచ్చారు. కార్యకర్తనే అధినేత అన్న కార్యక్రమానికి మహానాడులో శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా పార్టీ కేంద్ర ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలకు వారానికి ఒక రోజు మంత్రులు నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందుబాటులో ఉంటున్నారు. కూటమి పొత్తులతో నామినేట్ పదవులు ఆశించి భంగపడిన నేతలకు ప్రత్యాన్మాయ పదవులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. 2024 ఎన్నికల ఫలితాలను 2029 లోనూ రిపీట్ చేసేలా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలతో ముందుకు పోతోంది టీడిపి అధిష్టానం. మరి ముఖ్యంగా యువనేత నారా లోకేష్ కార్యకర్తలను ప్రధాన కార్యాలయంలో కలవడమే కాక అవసరమైతే నేరుగా వారి నివాసాలకు వెళ్లి వారికి ధైర్యాన్ని ఇస్తున్నారు. గెలిపోటములను చవిచూసిన పార్టీగా ఎన్నో సంక్షోభాల నుంచి సంక్షేమాన్ని వెతుక్కున్న నేతగా ప్రత్యేక గుర్తింపు పొందిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2025లో సంతృప్తికరంగా పని చేశారన్న భావన తెలుగు తమ్ముళ్ళలో వ్యక్తమవుతోంది. జనసేన పార్టీకి 25 నినాదాల సంవత్సరం కాదు బాధ్యతల సంవత్సరం కూటమి పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చాక మాటలకంటే పనితీరే అసలైన గుర్తింపుగా మారుతుందని జనసేన అధినాయకత్వం స్పష్టంగా గ్రహించింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ ఎమోషనల్ పొలిటిక్స్ నుంచి అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ వైపు అడుగులు వేసింది. ఈ ఏడాది జనసేన ఎక్కువగా హడావిడి చేయలేదు కానీ ప్రభుత్వంలో తన పాత్రను కూడా తగ్గించుకోలేదు. ఇదే జనసేనకు ప్లస్ పాయింట్ గా మారింది. అయితే అదే సమయంలో ప్రజల్లో కనిపించాల్సిన స్థాయి విజిబిలిటీ తగ్గిందన్న విమర్శ కూడా లేకపోలేదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఉనికి ఇంకా బలపడాల్సిన అవసరం స్పష్టంగా కనిపించింది. పార్టీని ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్న ఇంకా ఇంతవరకు నిర్దిష్టమైన కమిటీలను నియమించుకోలేదన్న అపవాదు లేకపోలేదు. అధినేత కోసం పార్టీ కోసం ఏం చేసేందుకైనా వెనకాడని తత్వం ఉన్న బలమైన సైనికులు జనసేన పార్టీ సొంతం అయితే జనసైనికుల విషయంలో మాత్రం అధిష్టానం ఆశించిన స్థాయిలో అడుగులు వేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీల నియామకం పదవులు ఆశించి భంగపడుతున్న నేతలకు భరోసా లాంటి వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన జనసేనని కార్యకర్తలు నేతలతో ఈ ఏడాది పూర్తి స్థాయి సమయం కేటాయించి వారికి చేరువయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. క్షేత్ర స్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై గట్టిగానే ఆలోచనలు చేశారు. సమయం చిక్కినప్పుడల్లా అన్ని వర్గాలతో సమావేశం కావడం ప్రజా సమస్యలు స్వయంగా పరిశీలించడం పార్టీ వర్గాలకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడంపై శ్రద్ధ పెట్టారు. కూటమి మిత్ర ధర్మం గురించి క్యాడర్ కు లోతుగా వివరించారు. వివాదాలకు తావులేని పరిస్థితి కల్పించి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోవడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పార్టీని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి గ్రౌండ్ రియాలిటీస్ ని ఆకలింపు చేసుకున్నారని చెప్పవచ్చు. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు నామినేటెడ్ పదవులు పొందిన నేతలతో కార్యక్రమాలను నిర్వహిస్తూ వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. 2029 ఎన్నికలకు జనసేన పూర్తి స్థాయి క్యాడర్ ఉన్న పార్టీగా రూపాంతరం చెందేందుకు 2025లో బలమైన అడుగులు వేసిందని చెప్పొచ్చు. ఈ ఏడాది జనసేనకు జయం అంటే పార్టీ పూర్తి స్థాయిలో పరిపక్వత అపజయం అంటే ప్రజలతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశాలు తగ్గిపోవడం మొత్తానికి జనసేన 2025 లో అనేక కొత్త మార్పులతో రెట్టించిన ఉత్సాహంతో నేర్చుకుంటూ ముందుకు నడిచిన పార్టీగా కనిపించిందని చెప్పుకోక తప్పదు. ఏపీ కూటమి ప్రభుత్వంలో మరో పార్టీ బిజెపీ 2025లో కాషాయదాల్లో చెప్పుకోదగ్గా పెద్ద రాజకీయ మలుపులు ఏమీ లేవు. కూటమిలో భాగస్వామిగా తన పాత్రను నిర్వర్తించడం పైనే పార్టీ దృష్టి పెట్టింది. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో స్వతంత్ర రాజకీయ ముద్ర ఇంకా స్పష్టంగా కనిపించలేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా నిర్ణయాత్మక స్థాయిలో పాత్ర పరిమితంగానే ఉందన్న భావన రాజకీయ పరిశీలకులో వ్యక్తమవుతోంది. కానీ పార్టీ పరంగా మాత్రం ఆంధ్రప్రదేశ్లో బలపడేందుకు బలమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కూటమి పార్టీలతో పాటు ప్రతిపక్ష పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వారికి కాషాయ కండువ కప్పుతోంది. రాష్ట్ర రథసారధిగా బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ పార్టీ బలోపేతానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. కమలదళ వికాసానికి కార్యకర్తల సమన్వయంతో విశేష కృషి చేస్తున్నారు. 2029 నాటికి పార్టీ ప్రాంతాలకు అతీతంగా ప్రతి చోట ప్రభావం చూపేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు యాత్రలు చేస్తూ నేతలను ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కూటమిలో ఉన్న పార్టీగా కాకుండా భారతీయ జనతా పార్టీగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 25లో బీజెపీకి జయం అంటే అధికారంలో భాగస్వామ్యం అపజయం అంటే స్వతంత్ర గుర్తింపు లేకపోవడం కూటమి స్థిరత్వమే ఈ ఏడాది బీజెపీ రాజకీయ లక్ష్యంగా మారింది. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 2025 పరీక్షా కాలమనే చెప్పాలి. ప్రతిపక్షంలో అసలైన పాత్ర ఏంటో తేల్చుకోవాల్సిన సంవత్సరం. అధికారంలో లేని పరిస్థితుల్లో పార్టీ ఎలా స్పందిస్తుందో ప్రజలు జాగ్రత్తగా గమనించిన ఏడాది ఇది. వైసపి ఉద్యమాలు చేసింది. ప్రభుత్వాన్ని విమర్శించింది. కానీ ఆ పోరాటాలకు స్పష్టమైన దిశ ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం కరవైందనే చెప్పాలి. ప్రజా సమస్యలను రాజకీయంగా మలుచుకోవడంలో వైసపీ పూర్తిగా సక్సెస్ కాలేకపోయిందన్న విమర్శలు లేకపోలేదు. అయితే పార్టీ చీలిపోకుండా నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ సాధించిన పరిమిత విషయంఅనే చెప్పాలి. క్యాడర్ ను కట్టిపెట్టగలిగింది. నాయకత్వంపై విమర్శలు వచ్చిన ఎదుర్కొని నిలబడింది. ముఖ్యంగా ప్రభుత్వం పిపిపి విధానంలో చేస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టింది. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే వీటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు పార్టీ అంతా ఏకతాటిపై పని చేయడంలో సక్సెస్ అయిందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే 2025 లోనూ పరిస్థితిలో పెద్ద మార్పు కనిపించలేదు. ప్రతిపక్షంగా ప్రభావం చూపలేదు. ప్రజల రాజకీయ చర్చల్లో కాంగ్రెస్ పేరు అరుదుగా మాత్రమే వినిపించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలా అధికార బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంపశయ్య మీద ఉన్న పార్టీకి మూలికా వైద్యం చేస్తున్నారు తప్పించి సంజీవిని మాత్రం కాలేకపోయిందన్న వాదన ఆ పార్టీ నేతల్లోనే బలంగా వినిపిస్తోంది. షర్మిల లాంటి దీటైన నాయకురాలు కింది స్థాయిలో నాయకత్వ లోటు స్పష్టమైన దిశ లేకపోవడం పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం అనుకూలంగా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ మీడియా ముఖంగా విమర్శలతో పాటు ఆందోళన నిర్వహిస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోసం పాకులాడుతోందని చెప్పక తప్పదు. ఈ ఏడాది కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ విషయం ఏది కనిపించలేదు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఏడాది కాలం వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు ప్రభుత్వానికి ఇంకా టైం ఇస్తున్నారు. కానీ ఆ టైం ఇంకా ఎంతకాలం టీడిపి పాలనలో పట్టు సాధించింది. జనసేన బాధ్యతను అర్థం చేసుకుంది. బీజెపీ కూటమిలో నడుస్తూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరిస్తోంది. అయితే ప్రతిపక్ష వైసపీ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను వెతుక్కుంటుండగా కాంగ్రెస్ పార్టీ ఇంకా లేచి నిలబడలేకపోతోంది. ఇలా కాలచక్రంలో మరో ఏడాదిలోకి వెళ్లే ముందు ఇక మాటలు కాదు పనులే మాట్లాడాలని రాజకీయ పార్టీలకు ప్రజలు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories