
కరోనా టెస్ట్ రిజల్ట్ (ఫొటో ట్విట్టర్)
AP Corona Cases: ఏపీలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 8వేల 110 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 12 వేల లోపు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 97,863 శాంపిల్స్ పరీక్షించగా, 8 వేల 110 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి 67 మంది మృతి చెందారు.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17 లక్షల 84 వేల 988కు చేరగా ఇప్పటివరకు 11 వేల 763 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా 12,981 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 99వేల 057 యాక్టివ్ కేసులున్నాయి.
#COVIDUpdates: 10/06/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) June 10, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 17,84,988 పాజిటివ్ కేసు లకు గాను
*16,74,168 మంది డిశ్చార్జ్ కాగా
*11,763 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 99,057#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/yqY1dg75Wi
గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 మంది కరోనాతో మరణించారు. ఇక తూర్పు గోదావరిలో అత్యధికంగా 1416 కేసులు నమోదయ్యాయి. అలాగే చిత్తూరులో 1042, అనంతపూరంలో 906 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలులో 235 కేసులు నమోదయ్యాయి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire