AP News: శ్రీకాకుళంలో 'కిలేడీ' కలకలం.. 19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లి కాని యువకులే ఈమె టార్గెట్!

AP News
x

AP News: శ్రీకాకుళంలో 'కిలేడీ' కలకలం.. 19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లి కాని యువకులే ఈమె టార్గెట్!

Highlights

AP News: ఇచ్ఛాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి అనే యువతి, మధ్యవర్తుల సహకారంతో పెళ్లి పేరుతో యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి అనంతరం పారిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

AP News: పెళ్లి అంటే జీవితాంతం బంధం అని నమ్మే అమాయక యువకుల్ని టార్గెట్ చేస్తూ ఓ యువతి వరుస మోసాలకు పాల్పడుతున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపుతోంది. ఇచ్ఛాపురానికి చెందిన 19 ఏళ్ల వాణి అనే యువతి, మధ్యవర్తుల సహకారంతో పెళ్లి పేరుతో యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి అనంతరం పారిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర రాష్ట్రాలకు చెందిన పెళ్లికాని యువకులను గుర్తించి, వివాహం చేయిస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకోవడం, పెళ్లి జరిగిన కొద్ది రోజులకే అక్కడి నుంచి జారుకోవడం ఈ ముఠా పని తీరుగా పోలీసులు గుర్తించారు. తాజాగా కర్ణాటకకు చెందిన సురేష్ అనే యువకుడిని పెళ్లి చేసుకున్న వాణి వారం రోజుల్లోనే అదృశ్యమవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది.

వాణి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి బంధువుల వద్ద పెరిగిన నేపథ్యంలో, ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఇచ్ఛాపురానికి చెందిన ముగ్గురు మహిళలు ఈ మోసానికి రూపకర్తలుగా వ్యవహరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు వాణితో పెళ్లి చేయిస్తామని చెప్పి యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ సొమ్మును పంచుకుంటున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

పోలీసుల విచారణలో వాణి ఇప్పటివరకు 8 పెళ్లిళ్లు చేసి మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తుండగా, తాను ఒక్క పెళ్లి మాత్రమే చేసుకున్నానని, మరో రెండు నిశ్చితార్థాలు జరిగాయని ఆమె చెబుతోంది. అయితే డబ్బు కోసమే ఈ వ్యవహారం చేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించినట్టు సమాచారం.

బాధిత యువకులు తమ డబ్బు తిరిగి ఇప్పించాలని, ఈ మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రధాన నిందితురాలు వాణితో పాటు మధ్యవర్తుల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories