Aditya Pharmacy MD: ఆత్మహత్య చేసుకున్న ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు

Aditya Pharmacy MD
x

Aditya Pharmacy MD: ఆత్మహత్య చేసుకున్న ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు

Highlights

Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య పాల్బడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. విజయవాడలోని క్షత్రియ భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.

Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఆత్మహత్య పాల్బడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. విజయవాడలోని క్షత్రియ భవన్‌లో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య విషయమై పోలీసులుకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు వచ్చి ధర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్నారు.

విజయవాడలో ఆదిత్య ఎండీ నరసింహరాజు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కి గురిచేసింది. అయోధ్య నగర్‌‌లో ఉన్న క్షత్రియ భవన్‌లో ఆయన ఆత్మహత్యకు పాల్బడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు కారణాలేంటో ఆరా తీస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో పోలీసులకు ఒక లేఖ దొరికినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఒక స్పష్టతలేదు. బాడీని స్వాధీనం చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.

ఇటీవలే నరసింహరాజు బెయిల్ మీద జైలు నుంచి బయటకు వచ్చారు. స్నేహితుడి హత్య కేసులో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజు జైలు నుంచి ఇటీవలే బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే ఈ లోపే ఈ ఆత్మహత్య సంఘటన చోటు చేసుకుంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆత్మహత్య సంఘటన తెలిసివెంటనే నరసింహరాజు భార్య హుటాహుటున హైదరాబాడ్ నుంచి విజయవాడకు బయలు దేరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories