Raithu Runamafi: రైతులకు గుడ్ న్యూస్..5వ విడత రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్

Raithu Runamafi: రైతులకు గుడ్ న్యూస్..5వ విడత రుణమాఫీకి ముహూర్తం ఫిక్స్
x
Highlights

Raithu Runamafi: తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రుణమాఫీ పథఖాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి...

Raithu Runamafi: తెలంగాణ రైతులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు రుణమాఫీ పథఖాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు విడతలుగా వేలాది మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ చేసిన ప్రభుత్వం..మరో విడత కోసం మహుర్తం ఫిక్స్ చేసింది. అయితే ఈ పథకం ద్వారా అందరికీ నిధులు అందలేదు. చాలా మంది రైతులు రుణమాఫీ కోసం వేచి చూస్తున్నారు.

తాజాగా నాలుగో విడతలో ప్రభుత్వం రూ. 2,747,67 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇంకా పలు ప్రాంతాల్లో రైతులకు ఈ రుణమాఫీ డబ్బులు ఇంకా అందలేవు. ఈ విషయం గురించి వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టతను ఇచ్చారు. వ్యవసాయ శాఖ అధికారులు తెలిపిన ప్రకారం మిగిలిన రైతులకు ఐదో విడతలో రుణమాఫీ నిధులు అందజేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో ఈ ఐదవ విడత డబ్బులను జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అయితే ఈ ఐదవ విడతతో రుణమాఫీ పూర్తిగా అమలవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ పథకం అమలు ప్రక్రియలో కొంత సమయం పట్టడంతో రైతులతో కొందరు అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం రుణమాఫీ నిరంతరం అప్ డేట్ ఇస్తూనే ఉంది. రైతుల సంక్షేమమే లక్ష్యమని చెబుతోంది. తెలంగాణ రుణమాఫీ పథకం ద్వారా రైతులపై ఉన్న ఆర్థిక ఒత్తిడిని తొలగించడం మాత్రమే కాదు..వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని చెప్పవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories