Tirumala Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్..జూన్ నెల టికెట్లు విడుదల.. వివరాలు ఇవే

Tirumala Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

Dhivi
Updated on: 8 May 2025 3:01 AM IST
Tirumala Tickets
X

Tirumala Tickets

Tirumala Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూన్ నెల కోటాను మార్చి 18న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లు లక్కీడీప్ రిజిస్ట్రేషన్ కోసం మార్చి 18 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 10గంటలకు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు మార్చి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల లోపు డబ్బులు చెల్లించిన వారికి టికెట్లు మంజూరు అవుతాయి.

మార్చి 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు జూన్ నెల కోటాను మార్చి 21న ఉదయం 10గంటలకు విడుదల చేస్తారు. మార్చి21న జ్యేష్టాభిషేకం టికెట్లు జూన్ 09 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి జ్యేష్టాభిషేం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను మార్చి 21న ఉదయం 11గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.

మార్చి 21న వర్చువల్ సేవల కోటా విడుదల, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను మార్చి 21న మధ్యాహ్నం 3గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మార్చి 22న అంగప్రదక్షిణం టోకెన్లు, జూన్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మార్చి 22న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను మార్చి 22వ తేదీ ఉదయం 11గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా… వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మార్చి 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. మార్చి 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల జూన్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మార్చి 24న ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో రిలీజ్ చేయనుంది.

తిరుమ తిరుపతిలలో జూన నెల గదుల కోటాను మార్చి 24న మధ్యాహ్నం 3గంటలకు ఆన్ లై్ లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్ సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేకోవచ్చని టీటీడీ కోరింది.

Dhivi

Dhivi

Next Story