Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని అరెస్ట్‌కు రంగం సిద్ధం?

All Set for Vidudala Rajinis Arrest
x

Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని అరెస్ట్‌కు రంగం సిద్ధం?

Highlights

Vidadala Rajini: హైదరాబాద్‌లో తీగ లాగితే.. చిలకలూరిపేటలో డొంక కదిలింది. ఏసీబీ అధికారులు దాడుల్లో మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపినాథ్‌ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు.

Vidadala Rajini: హైదరాబాద్‌లో తీగ లాగితే.. చిలకలూరిపేటలో డొంక కదిలింది. ఏసీబీ అధికారులు దాడుల్లో మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపినాథ్‌ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లారు. మైనింగ్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న అభియోగాలపై విడదల గోపినాథ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో మాజీ మంత్రి విడదల రజిని అరెస్టుకు రంగం సిద్ధం అయ్యిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. 2021 ఏప్రిల్ 4న యడ్లపాడుకు చెందిన స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి.. 2 కోట్ల 20 లక్షలు తీసుకున్నారని.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టారు అధికారులు. 5 కోట్ల రూపాయాలు ఇవ్వాలని విడుదల రజిని పీఏ రామకృష్ణ.. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరింపులకు గురిచేసినట్టు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుసార్లు బెదిరింపులు, సంప్రదింపుల తర్వాత 2 కోట్ల 20 లక్షలకు ఒప్పందం కుదిరిందని బాధితులు తెలిపారు.

అప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో.. ఫిర్యాదు చేసేందుకు జంకిన స్టోన్ క్రషర్ యజమాని.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏసీబీకి ఫిర్యాదు చేశారు. విడుదల రజిని పిఏ రామకృష్ణ ఐదు కోట్లు ఇస్తేనే.. స్టోన్ క్రషర్ నిర్వహించుకోవాలని బెదిరించినట్టు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. క్రషర్ యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులకు విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయి. దీంతో ఫిర్యాదుదారుడి ఆరోపణ నిజమేనని తెలుసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. అందులో A-1 గా మాజీమంత్రి విడదల రజిని, A-2గా అప్పటి విజిలెన్స్ అధికారి పల్లె జాషువా, A-3గా విడదల రజిని మరిది గోపినాథ్‌ పేరు.. A-4గా రజిని పీఏ రామకృష్ణ పేరును చేర్చారు.

ఎప్పుడైతే.. రజిని పీఏ రామకృష్ణ బెదిరించారో.. అదే క్రమంలో అప్పుడు విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువా కూడా ఈ బెదిరింపు ప్రక్రియలో ఉన్నట్టు క్రషర్ యజమాని తెలిపారు. దీంతో ఇప్పటికే పలుమార్లు అప్పటి విజిలెన్స్ అధికారిగా ఉన్న పల్లె జాషువాను విచారించారు ఏసీబీ అధికారులు. ప్రశ్నించిన ప్రతిసారి జాషువా పొంతన లేని సమాధానాలు చెప్పినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక ఇప్పటికే A-3గా ఉన్న రజిని మరిది గోపినాథ్‌ను ఇటీవల అరెస్ట్‌ చేసిన ఏసీబీ.. ఇక మిగిలిన వారిని సైతం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఈ కేసులో ఏ1గా ఉన్న విడుదల రజని అరెస్టు కూడా తప్పదనే ప్రచారం జరుగుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories