Allu Arjun: మానవత్వం చాటుకున్న అల్లు అర్జున్.. దివ్యాంగురాలికి జీవితాంతం భరోసా!

Allu Arjun: మానవత్వం చాటుకున్న అల్లు అర్జున్.. దివ్యాంగురాలికి జీవితాంతం భరోసా!
x
Highlights

Allu Arjun: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను 'ఐకాన్ స్టార్' అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు.

Allu Arjun: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ తాను 'ఐకాన్ స్టార్' అని అల్లు అర్జున్ మరోసారి నిరూపించుకున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర ప్రమాదంలో అనాథగా మిగిలిన ఒక దివ్యాంగురాలికి ఆయన కొండంత అండగా నిలిచారు.

గత నెల 28న వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనలో కడింపల్లి ధనరాజు అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన భార్య గతంలోనే మరణించగా, అప్పటి నుండి తన మానసిక దివ్యాంగురాలైన కుమార్తె దుర్గను ధనరాజు కంటికి రెప్పలా చూసుకునేవారు. తండ్రి మరణంతో దుర్గ దిక్కులేని స్థితిలోకి వెళ్లడంపై సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

దుర్గ దీనస్థితి గురించి తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. తన మిత్రుడు, నిర్మాత బన్నీ వాసు ద్వారా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులను వేట్లపాలెం పంపించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న అనంతరం, దుర్గ పోషణ బాధ్యతను తాను తీసుకుంటానని బన్నీ ప్రకటించారు.

దుర్గ పోషణ కోసం జీవితాంతం ప్రతి నెలా ₹7,500 నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా అల్లు అర్జున్ ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొలిశెట్టి సాగర్ సోమవారం అధికారికంగా వెల్లడించారు. ఆపదలో ఉన్న ఒక నిరుపేద దివ్యాంగురాలికి అల్లు అర్జున్ చేసిన ఈ సాయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories