Anakapalli: గర్భం దాల్చిన కేజీబీవీ విద్యార్థిని

Anakapalli: గర్భం దాల్చిన కేజీబీవీ విద్యార్థిని
x

Anakapalli: గర్భం దాల్చిన కేజీబీవీ విద్యార్థిని

Highlights

Anakapalli: అనకాపల్లి జిల్లా కేజీబీవీలో పదో తరగతి విద్యార్థి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Anakapalli: అనకాపల్లి జిల్లా కేజీబీవీలో పదో తరగతి విద్యార్థి గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న స్కూల్ సిబ్బంది.. బాలికను గుట్టుచప్పుడు కాకుండా కుటుంబసభ్యులకు అప్పగించారు. గొలుగొండ మండలానికి చెందిన ఓ బాలిక అమ్మమ్మ సంరక్షణలో ఉంటూ కేజీబీవీలో పదో తరగతి చదువుతోంది. అయితే ఆ బాలికకు రెండు రోజుల నుంచి వాంతులు అవుతుండటంతో స్కూల్ సిబ్బంది చికిత్స అందించారు. అయినా వాంతులు తగ్గకపోవడంతో పరీక్ష చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలికను తన అమ్మమ్మకు అప్పగించారు.

గత కొన్నిరోజులుగా గొలుగొండ కేజీబీవీలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. రెండ్రోజుల క్రితం స్కూళ్లో తీవ్ర జాప్యం జరిగింది. బాలికలు అన్నం తినేసరికి రాత్రి 11 గంటలు దాటింది. అలాగే రెండు రోజుల క్రితం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు ఇక్కడకు రాగా.. ప్రిన్సిపాల్‌ సుధా నిరాకరించారు. దీంతో వారు గేటు దగ్గర ఆందోళన చేశారు. తాజాగా ఒక విద్యార్థిని గర్భం దాల్చిన విషయం బయటకు రావడంతో ప్రిన్సిపాల్‌ సుధా తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని డ్రామాలు ఆడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంఛార్జి MEO సత్యనారాయణ ఆమెకు ఫోన్‌ చేసి వివరణ అడిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories