AP Budget 2026: ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్..!

AP Budget 2026: ఏపీ బడ్జెట్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి పయ్యావుల కేశవ్..!
x
Highlights

AP Budget 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది.

AP Budget 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా ఆమోదం తెలిపింది. సచివాలయంలో జరిగిన ఈ కీలక భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేటాయింపులపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం బడ్జెట్ ప్రతులకు కేబినెట్ ఓకే చెప్పింది.

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లకు అందజేశారు. కేబినెట్ ఆమోదం పొందిన వెంటనే, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీకి బయల్దేరారు. మరికాసేపట్లో ఆయన శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సాధారణ బడ్జెట్‌తో పాటు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రభుత్వం ఇవాళే ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories