Andhra Pradesh Budget 2026-27 Highlights: రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్.. 'తల్లికి వందనం'కు భారీ కేటాయింపులు!

Andhra Pradesh Budget 2026-27 Highlights: రూ. 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్.. తల్లికి వందనంకు భారీ కేటాయింపులు!
x
Highlights

AP Budget 2026 Live: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AP Budget 2026 Live: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్ వరుసగా మూడవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం విశేషం. మొత్తం రూ. 3,32,205 కోట్ల అంచనాతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం విద్య, మహిళా సంక్షేమం మరియు నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది.

బడ్జెట్ కేటాయింపులు - ముఖ్యాంశాలు:

ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన పథకాలు మరియు శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:

తల్లికి వందనం 9668 కోట్లు

మహిళా శిశు సంక్షేమం - 4581కోట్లు

స్కాలర్షిప్స్ -3836కోట్లు

సమగ్ర శిక్షణ - 2946కోట్లు

ఉన్నత విద్యాశాఖ - 2566కోట్లు

డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం- 2161కోట్లు

మనబడి మన భవిష్యత్తు - 1500కోట్లు

స్కిల్ డెవలప్మెంట్-1232కోట్లు

Pm స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా - 707 కోట్లు.

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర - 654 కోట్లు.

యూత్ అండ్ స్పోర్ట్స్ - 438కోట్లు

ఈ బడ్జెట్‌లో విద్యా రంగానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా 'తల్లికి వందనం' పథకానికి దాదాపు రూ. 9,668 కోట్లు కేటాయించడం ద్వారా విద్యార్థుల తల్లులకు అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే నైపుణ్యాభివృద్ధి (Skill Development) కోసం రూ. 1,232 కోట్లు కేటాయించడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories