Dangeti Jahnavi: అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మన తెలుగు అమ్మాయి జాహ్నవి

Dangeti Jahnavi
x

Dangeti Jahnavi: అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న మన తెలుగు అమ్మాయి జాహ్నవి

Highlights

Dangeti Jahnavi: వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి త్వరలో రోదసిలో అడుగుపెట్టనున్నారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి అంతరిక్షంలో గడిపి, అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయ తొలి తెలుగు మహిళగా రికార్డ్ సృష్టించబోతున్నారు.

Dangeti Jahnavi: వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల దంగేటి జాహ్నవి త్వరలో రోదసిలో అడుగుపెట్టనున్నారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో ఐదు గంటల పాటు జాహ్నవి అంతరిక్షంలో గడిపి, అంతరిక్షంలో అడుగుపెట్టిన భారతీయ తొలి తెలుగు మహిళగా రికార్డ్ సృష్టించబోతున్నారు. వివరాల్లోకి వెళితే..

అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన స్పేస్ మిషన్ కోసం ఆమె ఆస్ట్రోనాట్ కాండిడేట్‌గా ఎంపికయ్యారు. 2029లో జరగబోయే తొలి అంతరిక్ష యాత్రలో జాహ్నవి స్పేస్‌లో ఐదు గంటలపాటు గడపనున్నారు. భారీతయ తొలి తెలుగు మహిళగా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. నిజంగా అంతరిక్షయానం అందరికీ సాధమయ్యేది కాదు.. అలాంటిది జాహ్నవి అతిచిన్నవయసులో సాధించింది. టైటాన్‌ స్పేస్ ఇండస్ట్రీ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం జాహ్నవి ఆస్ట్రోనాట్‌ మెంబర్‌‌గా సెలెక్ట్ అయ్యారు. ఈ టైటాన్‌ సంస్థ అమెరికాకు చెందిన ఒక ప్రయవేట్ స్పేస్ సంస్థ. అయితే జాహ్నవి వెళుతున్న టీంకి నాసా మాజీ ఆస్ట్రానాట్ విలియం మెక్ ఆర్ధర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు.

ఇదిలా ఉంటే భారతదేశంలోనే పుట్టి పెరిగి అమెరికా నుంచి అంతరిక్షానికి ఇప్పటివరకు ఎవరూ వెళ్లలేదు. ఇప్పటివరకు వెళ్లిన వారంతా అమెరికాలో స్థిరపడ్డ భారతీయులు. అయితే జాహ్నవి వెళితే.. భారత దేశ తొలి మహిళ అవుతుంది. అయితే ఈ అవకాశం రావడం అంత ఈజీకాదు. జాహ్నవి పలు పరీక్షలు పూర్తిచేసిన తర్వాతే సెలెక్ట్ అయింది. ఈ మిషన్‌కు అర్హత సాధించింది. ఈమె రోదసిలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 5గంటల పాటు గడపనున్నారు. దీనికోసం జాహ్నవికి అమెరికాతో పాటు పలు దేశాల్లో మూడేళ్ల పాటు శిక్షణ ఇస్తారు.

జాహ్నవి నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌కు భారత్ తరపున ఎంపికై రికార్డ్ సృష్టించింది. ఐదు గంటలపాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌ ద్వారా పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనలకు ఒక కొత్త దిక్చూచి ఏర్పడుతుందని జాహ్నవి తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories