రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం

రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం
x
Highlights

రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను శుక్రవారం మంత్రి నారాయణ ప్రారంభించారు.

అమరావతి: రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను శుక్రవారం మంత్రి నారాయణ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హై కోర్టు నిర్మాణం జరుగుతుంది.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో హై కోర్టు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హై కోర్టు నిర్మాణం జరుగుతుందని వివరించారు.

2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని చెప్పారు. 8వ అంతస్తుల్లో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు. మొత్తం 45,000 టన్నుల స్టీల్ ను భవనానికి వాడుతున్నట్లు తెలిపారు. 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories