AP 10th Class Hall Tickets: ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు ఈ వారంలోనే.. ఎక్కడ తీసుకోవాలంటే..

AP 10th Class Hall Tickets 2026: ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఈ వారం విడుదల కానున్నాయి.
x

AP 10th Class Hall Tickets 2026

Highlights

AP 10th Class Hall Tickets 2026: ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఈ వారం విడుదల కానున్నాయి. అధికారిక వాట్సప్ నంబర్, లీప్ యాప్ ద్వారా హాల్ టికెట్లు

AP 10th Class Hall Tickets 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ హాల్ టికెట్లను ఈ వారంలోనే విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరుకానున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక మార్గాల ద్వారానే పొందాలని బోర్డు స్పష్టం చేసింది.

AP 10th Class Hall Tickets 2026:పదో తరగతి విద్యార్థుల సౌకర్యార్థం హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి విద్యాశాఖ రెండు ప్రధాన మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు 'మన మిత్ర' వాట్సప్ నంబరు (9552300009) ద్వారా లేదా పాఠశాల విద్యాశాఖకు చెందిన అధికారిక 'లీప్' (LEAP) యాప్ నుంచి నేరుగా తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

AP 10th Class Hall Tickets 2026:హాల్ టికెట్ల పంపిణీ విషయంలో విద్యాశాఖ అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయడానికి లేదా పంపిణీ చేయడానికి బోర్డు ఎలాంటి ప్రైవేట్ ఏజెన్సీలకు లేదా థర్డ్ పార్టీ వెబ్‌సైట్లకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. కేవలం ప్రభుత్వ అధికారిక యాప్ మరియు వాట్సప్ నంబర్ ద్వారా మాత్రమే విద్యార్థులు వీటిని సేకరించాల్సి ఉంటుంది.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు నేరుగా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి హాల్ టికెట్లను తీసుకోవచ్చని బోర్డు సూచించింది. పాఠశాల లాగిన్ ద్వారా ప్రధానోపాధ్యాయులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసి, విద్యార్థులకు ధ్రువీకరించి అందజేస్తారు.

AP 10th Class Hall Tickets 2026:ఈ క్రమంలో బోర్డు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ప్రైవేట్ వెబ్‌సైట్ల ద్వారా లేదా అనధికారిక లింకుల ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేయవద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసిన హాల్ టికెట్లతో వస్తే, వారిని పరీక్షలకు అనుమతించే ప్రసక్తే లేదని బోర్డు కరాఖండిగా చెప్పింది. సమాచారం కోసం కేవలం ప్రభుత్వ వెబ్‌సైట్లను మాత్రమే అనుసరించాలని కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories