Chandrababu: ఏపీలో వ్యవసాయంలో లాభాలు పెంచేలా ప్లాన్స్.. రివ్యూలో చర్చించిన సీఎం చంద్రబాబు

Chandrababu: ఏపీలో వ్యవసాయంలో లాభాలు పెంచేలా ప్లాన్స్.. రివ్యూలో చర్చించిన సీఎం చంద్రబాబు
x

Chandrababu: ఏపీలో వ్యవసాయంలో లాభాలు పెంచేలా ప్లాన్స్.. రివ్యూలో చర్చించిన సీఎం చంద్రబాబు

Highlights

రైతుకు లాభం రావాలి.. వినియోగదారునికి ప్రయోజనం కలగాలన్న నినాదం తో ముందుకు వెళ్దాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

AP CM Chandrababu Agriculture Review: రైతుకు లాభం రావాలి.. వినియోగదారునికి ప్రయోజనం కలగాలన్న నినాదం తో ముందుకు వెళ్దాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు..అధికారుల సమీక్షలో వ్యవసాయం పై స్పష్టమైన సందేశం ఇచ్చారు... వ్యవసాయ మార్కెట్ కమిటీల నుండి, రైతు బజార్ల వరకు వ్యవసాయ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు... ఖరీఫ్, రబీ ప్రణాళికలతో పాటు భూసారం, సేంద్రీయ సాగు,రైతు బజార్ల ఆధునికీకరణ తో పాటు పలు అంశాలపై సీఎం చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 218 మార్కెట్ కమిటీల స్థలాలను సద్వినియోగం చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి మార్కెట్ కమిటీకి మౌలిక సదుపాయాల మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.

రైతు బజార్లను ఆధునీకరించి.. మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేసే దిశగా ఆలోచించాలని సీఎం సూచించారు. రైతు సేవా కేంద్రాల పనితీరుపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం తగ్గిపోతుందని, సేంద్రీయ సాగుకు మారితేనే పర్యావరణానికి మంచిదన్నారు. 2026 ఖరీఫ్ నాటికి ఎరువుల వినియోగం తగ్గించి, సేంద్రీయ సాగు పెంచేలా రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రబీ సీజన్ కోసం రాష్ట్రం సిద్ధమైందని అధికారులు వివరించగా 23 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఎరువుల సరఫరా జరగాలని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరగొచ్చని కూడా తెలిపారు.

ఉల్లి, టమాటో, మిర్చి, మామిడి పంటల ధరలు తగ్గకుండా ముందస్తు ప్రణాళికలు చేసుకొమ్మని సీఎం సూచించారు. స్థానిక మార్కెట్, ఎగుమతులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాగు చేయాలని సూచించారు. పుట్టగొడుగుల సాగును సర్క్యులర్ ఎకానమీ లోకి తీసుకురావాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడతో జీవామృతం తయారు చేయడం, కూలీ ఖర్చు తగ్గించడం వంటి మార్గాలను పరిశీలించమన్నారు. పట్టు పురుగుల సాగు ప్రాంతాల్లో ఇతర పంటల ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. జీలుగు బెల్లం, పట్టు వస్త్రాల నమూనాలను సీఎం పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో తయారైన జీలుగు ఉత్పత్తులను అరకు కాఫీ తరహాలో బ్రాండ్ చేయాలని ఆదేశించారు. అలాగే పట్టుగూళ్లతో తయారైన వస్త్రాలు, బొకేలను రాష్ట్రానికి వచ్చిన అతిథులకు అందించే ఆలోచనను కూడా సీఎం స్వాగతించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories