AP Budget 2026-27: వ్యవసాయ రంగానికి రూ. 13,598 కోట్లు.. విద్యా వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యం!

AP Budget 2026-27: వ్యవసాయ రంగానికి రూ. 13,598 కోట్లు.. విద్యా వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యం!
x
Highlights

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన వ్యవసాయ రంగానికి, భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే విద్యా రంగానికి ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది.

వ్యవసాయం: రైతు సంక్షేమానికి పెద్దపీట

వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 13,598 కోట్లు కేటాయించింది. గత ఏడాది 53.2 లక్షల మంది రైతులకు రూ. 7,600 కోట్ల మేర రుణాలు అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినట్లు మంత్రి తెలిపారు. పారదర్శకత కోసం 2021 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (PACS) డిజిటలైజ్ చేశామని, ప్రస్తుతం 2017 సంఘాలు ఈ-ప్యాక్స్ ద్వారా రైతులకు వేగంగా సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.

విద్య: భవిష్యత్తు నిర్మాణంపై దృష్టి

విద్యా రంగాన్ని కేవలం పరిపాలన బాధ్యతగా కాకుండా ఒక నైతిక కట్టుబాటుగా ప్రభుత్వం భావిస్తోందని మంత్రి పయ్యావుల వెల్లడించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యార్థులు ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా విద్యా విధానాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. 'తల్లికి వందనం', 'మనబడి మన భవిష్యత్తు' వంటి పథకాల ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా, 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం' ద్వారా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు:

2019-24 మధ్యకాలంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని మంత్రి విమర్శించారు. సరైన సన్నద్ధత లేకుండా 1000 పాఠశాలలను సీబీఎస్ఈకి మార్చడం వల్ల 90 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ధ్వజమెత్తారు. ఐబీ (IB) పాఠ్య ప్రణాళికలు, టోఫెల్ వంటి అచరణ సాధ్యం కాని నిర్ణయాల వల్ల ప్రజాధనం వృథా అయిందని.. 'నాడు-నేడు'లో రూ. 7,876 కోట్ల విలువైన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయని ఆయన విమర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories