AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం

AP Cabinet: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలకు ఆమోదం
x
Highlights

AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) మూడున్నర గంటలపాటు జరిగింది.

AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (క్యాబినెట్ భేటీ) మూడున్నర గంటలపాటు జరిగింది. ఈ సమావేశంలో సుమారు 70 అజెండా అంశాలపై మంత్రులు చర్చించి, కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

క్యాబినెట్ ఆమోదించిన ముఖ్య నిర్ణయాలు:

రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటుకు ఆమోదం.

వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ (CRDA) తీసుకున్న నిర్ణయాలు, కొత్త పరిశ్రమల స్థాపనకు భూ కేటాయింపులో రాయితీలు కల్పించడం.

రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.

మొంథా తుపానుపై సీఎం ప్రశంసలు:

అజెండా అంశాలపై చర్చ ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల పనితీరును ప్రశంసించారు.

"మొంథా తుపాను సమయంలో ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సహాయం అందేలా చేశారు." అధికారులతో సమన్వయంతో పనిచేయడం వల్లే సహాయక చర్యలు వేగంగా అందాయని, ఆర్టీజీఎస్ (RTGS) నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామని అన్నారు. అందరూ కలిసి కష్టపడి పనిచేసిన తీరును తాను స్వయంగా చూశానని చెబుతూ, సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

సీఎం కీలక సూచనలు:

నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి, పేదలందరికీ ఇళ్లు దక్కేలా చూడాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని ఆదేశించారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం తగదని, త్వరతగతిన సమస్యలు తీరడానికి సరైన విధానం (System) రూపొందించాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories