AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం
x

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం

Highlights

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకూ పలు అంశాలపై చర్చ జరగనుంది.

AP Cabinet Meeting Today: ఇవాళ ఏపీ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. జిల్లాల పునర్విభజన నుంచి రాజధాని అమరావతి అభివృద్ధి వరకూ పలు అంశాలపై చర్చ జరగనుంది. జిల్లాల పునర్విభజన, పీపీపీ విధానం, రుషికొండపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్‎. మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ప్రతిపాదనలతో తలెత్తిన సమస్యలపై ప్రధానంగా చర్చించనుంది. మరోవైపు అమరావతిలో క్వాంటం వ్యాలీ, సీఆర్డీఏ పరిధిలోని భారీ అభివృద్ధి పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం..

అమరావతిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటు, అంతర్జాతీయ ప్రమాణాలతో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చ జరగనుంది. రాజధాని ప్రాంతాన్ని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా సాంస్కృతిక, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో 56వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం లభించనుంది. రైతులకు సంబంధించిన భూముల వివాదాలపై రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories