పెట్టుబడుల్లో రికార్డుల దిశగా ఏపీ పయనం

పెట్టుబడుల్లో రికార్డుల దిశగా ఏపీ పయనం
x
Highlights

పెట్టుబడుల రంగంలో ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టించ బోతోంది...దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానిస్తూ...మళ్ళీ దేశం దృష్టిని ఆకర్షించింది.

పెట్టుబడుల రంగంలో ఆంధ్రప్రదేశ్ కొత్త చరిత్ర సృష్టించ బోతోంది...దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆహ్వానిస్తూ...మళ్ళీ దేశం దృష్టిని ఆకర్షించింది... అతిపెద్ద డేటా సెంటర్.. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు కాబోతోంది.ఇందుకు గాను రూ.87,520 కోట్లతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోయే ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విశాఖలోని రాంబిల్లి పరిసర ప్రాంతాల్లో...తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం వద్ద మూడు వేర్వేరు క్యాంపస్‌ల్లో రైడెన్ డేటా సెంటర్లు నిర్మించనున్నారు.విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు రూపుదిద్దుకోనున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా రూ.1లక్షా 14వేల 824 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. దీనివల్ల సుమారు 67 వేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు రానున్నాయి. అదే విధంగాఇంధన, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, పర్యాటక రంగాలకు చెందిన అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఆమోదం పొందాయి.

క్వాంటం వ్యాలీ తరహాలో ఏపీ టెక్నాలజీ రంగంలో కొత్త గేమ్ చేంజర్‌గా ఎదుగుతుందన్నారు సీఎం చంద్రబాబు. కేవలం 15 నెలల్లో పెట్టుబడుల పరంగా ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా పయనిస్తోందని ముఖ్యమంత్రి చెప్పారు. డేటా సెంటర్లతో కొత్త ఎకో సిస్టం వస్తోందని, విశాఖ త్వరలోనే ఏఐ సిటీగా రూపుదిద్దుకుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేస్తున్నామని... అదే తరహాలో అమరావతిని కేంద్రంగా చేసుకుని పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఆర్థిక ప్రగతి రీజియన్‌ను, అలాగే నెల్లూరు, రాయలసీమ జిల్లాల మధ్య మరో డెవలప్మెంట్ జోన్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు...ప్రస్తుతం రాయలసీమలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలు, ఆటోమొబైల్ కారిడార్లు వేగంగా ఎదుగుతున్నాయని తెలిపారు...ఉద్యాన పంటల ప్రాసెసింగ్ కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని, త్వరలోనే ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతుందని చెప్పారు.అమరావతిని నాలెడ్జ్ ఎకానమీ సెంటర్‌గా తీర్చిదిద్దాలని, కర్నూలు ఓర్వకల్లును పెద్ద పారిశ్రామిక హబ్‌గా తయారు చేయాలని సీఎం సూచించారు.

వర్జీనియా లా విశాఖ కూడా డేటా వ్యాలీగా రూపుదిద్దుకుంటోందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు...టీసీఎస్ కూడా త్వరలోనే విశాఖలో తన కొత్త క్యాంపస్ ప్రారంభించనుందని తెలిపారు...ఒక్క విశాఖ నగరంలోనే ఐటీ రంగంలో ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని చెప్పారు...దీనిపై సీఎం సూచనలు స్పష్టంగా ఇచ్చారన్నారు. ఐటీ సంస్థలు, వాటి ఉద్యోగుల కోసం హౌసింగ్, రోడ్లు, ఇతర సదుపాయాలు ఉండేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు ఉన్న ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని చెప్పారు...వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐటీ రంగంలో మరో ఐదు లక్షల మందికి అవకాశాలు కల్పించాలని సీఎం పేర్కొన్నారు...రామాయపట్నం సమీపంలోని భారత్ పెట్రోలియం రిఫైనరీ, ఆర్సెలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories