CM Chandrababu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: పోలవరం, జల జీవన్ మిషన్‌పై కీలక చర్చలు

CM Chandrababu: కేంద్ర మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ: పోలవరం, జల జీవన్ మిషన్‌పై కీలక చర్చలు
x
Highlights

AP CM Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీబిజీగా సాగుతోంది.

AP CM Chandrababu Naidu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన రెండో రోజు బిజీబిజీగా సాగుతోంది. మంగళవారం ఉదయం కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు.

రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేంద్రమంత్రికి వివరించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు మిగిలిన కీలక పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా సహకరించాలని కోరారు.

రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు తీరును చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ పథకం కింద పెండింగ్‌లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు రాష్ట్రంలోని ఇతర పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టుల అంశాలను కూడా కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమావేశంలో ఏపీ సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories