AP News: రేపు శ్రీశైలంలో ఏపీ సీఎం పర్యటన

AP News: గంగమ్మకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 31 July 2024 10:31 PM IST
AP CM visit to Srisailam tomorrow
X

AP News: రేపు శ్రీశైలంలో ఏపీ సీఎం పర్యటన 

AP News: ఏపీ సీఎం చంద్రబాబు రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీశైలం జలాశయానికి సీఎం చంద్రబాబు జలహారతి ఇవ్వనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ పరిశీలించారు. సీఎం పర్యటించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం కావడంతో పోలీసు బలగాలు విస్తృత తనిఖీలు చేపట్టారు. హెలిపాడ్ ప్రాంతంతో పాటు సుండిపెంటలో చంద్రబాబు పాల్గొననున్న ప్రజావేదికను బాంబు, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. చంద్రబాబు సున్నిపెంట హెలిప్యాడ్ చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం మల్లన్న క్షేత్రాన్ని దర్శించుకుంటారు.. ఆ తర్వాత కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్నని సందర్శించి.. సున్నిపెంటలోని వాటర్ యూజర్స్ అసోసియేషన్ వారితో ముఖాముఖి చర్చాగోష్టిలో పాల్గొననున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story