Pensions: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే పెన్షన్లు.. ఇవాళ పంపిణీ..!!

Pensions: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే పెన్షన్లు.. ఇవాళ పంపిణీ..!!
x
Highlights

Pensions: పింఛన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే పెన్షన్లు.. ఇవాళ పంపిణీ..!!

AP Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఏడాదిని పేదలకు శుభారంభంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈసారి ఒక రోజు ముందుగానే అందించేందుకు చర్యలు చేపట్టింది. జనవరి 1వ తేదీకి ముందే లబ్ధిదారుల చేతికి పెన్షన్ నగదు అందేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే రూ.2,743 కోట్లను ముందుగానే విడుదల చేసింది. నేటి నుంచి పింఛన్లు ఇవ్వనుంది.

రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికిపైగా పెన్షన్‌దారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వర్గాలకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటగా మారింది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ముందస్తు పంపిణీ ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

పెన్షన్ పంపిణీ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి అప్పగించారు. వారు నేడు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదును అందజేయనున్నారు. వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా బయటకు రావలేని వారికి ఇది ఎంతో సౌకర్యంగా మారింది. ఇవాళ ఏ కారణం వల్లనైనా పెన్షన్ తీసుకోలేని వారికి జనవరి 2వ తేదీన పంపిణీ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని ఈ చర్య స్పష్టం చేస్తోంది. కొత్త ఏడాది వేళ ఈ ముందస్తు పెన్షన్ పంపిణీ పేదల జీవితాల్లో ఆనందాన్ని నింపుతుందని, సంక్షేమ పాలనకు ఇది మరో నిదర్శనమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories