Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు
x

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు భారీగా నిధులు

Highlights

AP Government Sanctions ₹542 Crores for Polavaram Project Connectivity Road Works and Temple Protection

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టుల కనెక్టివిటీ, అనుబంధ పనుల కోసం భారీగా 542 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన రవణా, రక్షణ పనులకు ఉపకరిస్తాయి. ఈ నిధులతో మూడు కీలక నిర్మాణ పనులకు ఆమోదం లభించింది.

పోలవరం నుంచి స్పిల్‌వే, టన్నెల్ వరకు రోడ్ల నిర్మాణం కోసం 117 కోట్లు కేటాయించారు. ఇది ప్రాజెక్టు ప్రధాన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తోంది. గ్యాప్-1 నుంచి 21 కిలోమీటర్ల మేర ఎడమవైపు కనెక్టింగ్ రోడ్ నిర్మాణం కోసం 217 కోట్లు ఆమోదించారు. పురుషోత్తపట్నం దగ్గర గండి పోచమ్మ తల్లి ఆలయం రక్షణ పనుల కోసం 207 కోట్లు కేటాయించబడ్డాయి. ప్రాజెక్టు నిర్మాణం, వరదల ప్రభావం నుంచి ఆలయాన్ని సంరక్షించడానికి ఈ పనులు చేపట్టనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories