Ration Distribution: రేషన్ డోర్ డెలివరీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచే పంపిణీ ప్రారంభం

Ration Distribution
x

Ration Distribution: రేషన్ డోర్ డెలివరీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: వృద్ధులు, దివ్యాంగులకు నేటి నుంచే పంపిణీ ప్రారంభం

Highlights

AP Ration Distribution: Ration Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెల రేషన్‌ను వృద్ధులు, దివ్యాంగులకు ముందుగా ఇంటికే చేర్చాలని నిర్ణయించింది.

Ration Distribution: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ పంపిణీ వ్యవస్థలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూలై నెల రేషన్‌ను వృద్ధులు, దివ్యాంగులకు ముందుగా ఇంటికే చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 26 నుంచే సరుకుల పంపిణీ ప్రారంభమై, వచ్చే నాలుగు రోజుల్లో పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ విధానాన్ని నిలిపివేసి, రేషన్ షాపుల ద్వారా పంపిణీని కొనసాగిస్తోంది. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల్లో లబ్ధిదారులు సరుకులు పొందవచ్చు. అయితే వృద్ధులు, దివ్యాంగుల కోసం మాత్రం ఇంటికే సరుకులు చేర్చే విధానాన్ని కొనసాగిస్తున్నారు.

జూన్ నెలలో సమాచార లోపం వల్ల పలువురు వృద్ధులు, దివ్యాంగులు డిపోలకే వెళ్లాల్సి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై రేషన్‌ను ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాహనాల ద్వారా కాకుండా డీలర్లే ఇంటింటికి వెళ్లి సరుకులు అందించాలన్న సూచనలు ఇప్పటికే జారీ చేశారు.

గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13.14 లక్షల మందికి ఇంటికే రేషన్ పంపిణీ చేశారు. ఇకపై కూడా ఇదే విధంగా సమయానికి, పూర్తి అవగాహనతో రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో వృద్ధులు, దివ్యాంగులు రద్దీకి గురికాకుండా సులభంగా రేషన్ పొందే అవకాశం లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories