APPSC: ఏపీపీఎస్సీ అక్రమాలపై సిట్ వేటు: రంగంలోకి ఐజీ రవిశంకర్.. ఆ నియామకాలపై సర్కార్ ఉక్కుపాదం!

APPSC: ఏపీపీఎస్సీ అక్రమాలపై సిట్ వేటు: రంగంలోకి ఐజీ రవిశంకర్.. ఆ నియామకాలపై సర్కార్ ఉక్కుపాదం!
x
Highlights

APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

APPSC: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించిన 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో చోటు చేసుకున్న భారీ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

విచారణాధికారులు వీరే:

సీఐడీ ఐజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఈ సిట్ పని చేయనుంది. ఇందులో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె. చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలు, పేపర్ల మూల్యాంకనంలో జరిగినట్లు చెబుతున్న అక్రమాలపై ఈ బృందం లోతుగా దర్యాప్తు చేయనుంది.

కేసు దర్యాప్తులో భాగంగా ఎక్కడైనా సోదాలు చేసేందుకు, అవసరమైన ఆధారాలను స్వాధీనం చేసుకునేందుకు సిట్‌కు పూర్తి అధికారాలు కల్పించారు. దర్యాప్తు అవసరాల కోసం ఇతర ప్రభుత్వ శాఖల నుంచి అధికారులను లేదా సిబ్బందిని వినియోగించుకునే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. హైకోర్టు సూచనల మేరకు ఈ ఏడాది మార్చి 16లోగా సిట్ తన పూర్తి స్థాయి దర్యాప్తు నివేదికను న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది.

గత కొన్నేళ్లుగా 27/2018 నోటిఫికేషన్ నియామకాలపై అభ్యర్థులు చేస్తున్న పోరాటంలో భాగంగా, ఫిబ్రవరి 11న హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీళ్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో అక్రమాలకు పాల్పడిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories