Visakhapatnam: హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు

Visakhapatnam: హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు
x
Highlights

Visakhapatnam: విశాఖ హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడ ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టింది.

Visakhapatnam: విశాఖ హయగ్రీవ భూముల్లో రెవెన్యూశాఖ బోర్డులు ఏర్పాటు చేసింది. ఎండాడ ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ యంత్రాంగం బోర్డులు పెట్టింది. హయగ్రీవ ఫామ్స్‌ అండ్‌ డెవలపర్స్‌కు కేటాయించిన 12.51 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, ఓల్డేజ్‌ హోమ్‌ నిర్మాణం పేరుతో భూములు తీసుకుని.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. భూమి కేటాయింపు జరిగాక.. అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి.. అనేక తప్పిదాలు జరిగినట్టు అధికారులు గుర్తించారు.

అనాథలకు, వృద్ధులకు ఇళ్లు నిర్మిస్తామని చెప్పి.. 54 శాతం నిర్మాణాలకు అనుమతించిన భూమిలో 90శాతం అమ్మకాలు జరిగినట్టు వివరాలు సేకరించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోనే హయగ్రీవ సంస్థ.. ఈ భూములను విక్రయించాలని చూసిందని నిర్థారణకు వచ్చింది. ఇది భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని రుజువు కావడంతో హయగ్రీవ సంస్థకు కేటాయించిన 12.51 ఎకరాలును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఆ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేసింది రెవెన్యూశాఖ.

Show Full Article
Print Article
Next Story
More Stories