AP Half Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పుడంటే?

AP Half Day Schools
x

AP Half Day Schools: ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పుడంటే?

Highlights

AP Half Day Schools: పెరుగుతున్న ఎండల నేపథ్యంలో ఏపీలో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఎండలు, ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని అధికారులు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

ఈ నిర్ణయం ప్రకారం మార్చి 16 నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు. ఎండ తీవ్రత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు పదో తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో ప్రత్యేక షెడ్యూల్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఇదే సమయంలో రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కూడా మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రతి సంవత్సరం మార్నింగ్ స్కూల్స్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా విద్యార్థుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటిపూట బడులను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories