Anitha: మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం

Anitha: మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం
x

Anitha: మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం

Highlights

Anitha: మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

Anitha: మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం 'ఈగల్' (Eagle) అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఆమె తెలిపారు.

విశాఖపట్నం రేంజ్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మాదక ద్రవ్యాల నిర్మూలన సైకిల్ ర్యాలీని మంత్రి ఈరోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించి, "మాదక ద్రవ్యాలు వద్దు - జీవితమే ముద్దు" అంటూ నినాదాలు చేశారు. అనంతరం మంత్రి విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించారు.

మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు:

యువత భవిష్యత్తు ఎంతో ముఖ్యమని, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. గంజాయి మత్తులో యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఎన్డీపీఎస్ (NDPS) చట్టాన్ని కఠినంగా అమలుచేస్తున్నామని చెప్పారు.

గంజాయి రవాణా చేస్తున్నా లేదా వినియోగిస్తున్నా, వెంటనే 1972 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, తక్షణమే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories