IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ

IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం కోసం మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా జాబితాలో పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.

పి. శ్రీనివాసులు: ఇప్పటివరకు గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన పి. శ్రీనివాసులును బదిలీ చేస్తూ, ఆయనను మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.

రోణంకి గోపాలకృష్ణ: మార్కాపురం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న రోణంకి గోపాలకృష్ణకు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా బదిలీ చేశారు.

పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా శ్రీవాస్‌ నుపుర్‌ అజయ్‌కుమార్‌, ప్రకాశం జిల్లా జేసీగా కల్పన కుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్‌ అశోక్‌, అనకాపల్లి జేసీగా మల్లవరపు సూర్యతేజను ప్రభుత్వం నియమించింది. చిత్తూరు జేసీగా ఆదర్శ్‌ రాజేంద్రన్‌, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఎస్‌.ఎస్‌.శోబిక, కడప జేసీగా నిధి మీనా, విశాఖ జేసీగా గొబ్బిళ్ల విద్యాధరి, అన్నమయ్య జేసీగా శివ్‌ నారాయణ్‌ శర్మ, పల్నాడు జేసీగా వి.సంజనా సింహను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కడప జేసీగా నియమితులైన నిధి మీనా కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ భార్య కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories