AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

AP Inter Advanced Supplementary Results Released
x

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Highlights

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ బోర్డు వెబ్ సైట్ తోపాటు మన మనమిత్ర వాట్సాప్ ( 9552300009) నెంబర్ తో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ ముందుగా నిర్ణయించిన సమయం ప్రకారం నేడు ఉదయం 11గంటలకు అందుబాటులో ఉంచారు. ఏపీలో ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 1,35,826 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసారు. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలను 97,963మంది విద్యార్థులు రాసారు.

ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను https://resultsbie.ap.gov.in/వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ప్రాసెస్ వివరాలు చూద్దాం.

విద్యార్థులు ఏపీ ఇంటర్ విద్య మండలి అధికారిక వెబ్ సైట్ https://resultsbie.ap.gov.in/ పై క్లిక్ చేసి వెబ్ సైట్ హోం పేజీలో AP IPE అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అనే ట్యాబ్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ మొదటి సంవత్సరం లేదా 2వ సంవత్సరం ఫలితాలపై క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. లాగిన్ విండోలో విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేయాలి. స్క్రీన్ పై ఇంటర్ ఫలితాలు డిస్ప్లే అవుతాయి. భవిష్యత్ అవసరాల కోసం ఇంటర్ మార్క్ షీట్ డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని పెట్టుకోండి.

ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఏపీ ఇంటర్ ఫలితాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories