AP Rains Alert: ఆంధ్రా ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఎమర్జెన్సీ ఉంటే..ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయండి

AP Rains Alert
x

AP Rains Alert: ఆంధ్రా ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఎమర్జెన్సీ ఉంటే..ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయండి

Highlights

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. హోం , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయు గుండం కారణంగా కోస్తాంధ్రలో గత కొన్ని రోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మీదుగా ఇది కదిలే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చూసించింది.

మరికొన్ని రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని విపత్తు శాఖ హెచ్చరించింది. గంటకు 40‌‌–60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగిసిపడే అవకాశం ఉందన్నారు. అంతేకాదు సోమవారం వరకు మత్స్భ కారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్ ఫ్రీ నెంబర్లు

ఏపీ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మంత్రి అనిత స్వయంగా పరిస్థితులను సమీక్షించారు. అనంతరం ప్రజల అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070,1800 425 0101 నంబర్లకు కాల్ చేయొచ్చని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories