Ayyannapatrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్‌ అసెంబ్లీకి రావట్లేదు..

AP Speaker Ayyannapatrudu Interesting Comments On Jagan
x

Ayyannapatrudu: నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే.. జగన్‌ అసెంబ్లీకి రావట్లేదు..

Highlights

Ayyannapatrudu: వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు ఛాలెంజ్ విసిరారు.

Ayyannapatrudu: వైసీపీ అధినేత జగన్‌కు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు ఛాలెంజ్ విసిరారు. తనకు నమస్కారం చెప్పాల్సి వస్తుందనే భయం, సిగ్గుతోనే జగన్ అసెంబ్లీకి రావటం లేదని ఎద్దేవా చేశారు. నర్సీపట్నంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో అయ్నన్నపాత్రుడు పాల్గొన్నాడు. నవంబర్ 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయన్న అయ్యన్న పాత్రుడు.. వైఎస్ జగన్ సరదాగా ఓసారి అసెంబ్లీకి రావాలన్నారు. వస్తే ఇద్దరం కలిసి ముచ్చటించుకుందామంటూ సెటైర్లు పేల్చారు.

నవంబర్‌లో జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీనికోసం అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories