AP Vahana Mitra Scheme 2025: వాహనమిత్ర సాయం అక్టోబరు 1 నుండి ప్రారంభం... ఆర్థిక సహాయం పొందడానికి కొత్త మార్గదర్శకాలు జారీ

AP Vahana Mitra Scheme 2025
x

AP Vahana Mitra Scheme 2025: వాహనమిత్ర సాయం అక్టోబరు 1 నుండి ప్రారంభం... ఆర్థిక సహాయం పొందడానికి కొత్త మార్గదర్శకాలు జారీ

Highlights

AP Vahana Mitra Scheme 2025: ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద రూ.15,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది.

AP Vahana Mitra Scheme 2025: ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి వాహనమిత్ర పథకం కింద రూ.15,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు విడుదల చేసింది.

ఈ సాయం బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు మరియు ఇతర అవసరాల కోసం అందజేయనున్నారు.

అర్హతలు:

దరఖాస్తు చేసుకోవాలనుకునే డ్రైవర్లకు ఆంధ్రప్రదేశ్‌లో వాహనం నమోదు అయి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులు తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

ఆటో రిక్షా యజమానులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోయినా ఈ ఏడాది కోసం అనుమతించబడతారు, అయితే ఒక నెలలోపు తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది.

ప్యాసింజర్ వాహన యజమానులు (ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్) దారిద్య్ర రేఖ (బీపీఎల్) కింద ఉండాలి లేదా రేషన్ కార్డు కలిగి ఉండాలి.

అయితే, ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ కుటుంబ సభ్యులు ఈ పథకానికి అర్హత పొందరు. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది.

ఇతర నిబంధనలు:

ఇంటి విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి (గత 12 నెలల సగటు లెక్కింపు ఆధారంగా).

వాహనానికి ఎటువంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు.

మాగాణి భూమి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాల లోపు ఉండాలి (మొత్తం కలిపి 10 ఎకరాలు మాత్రమే).

పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస/వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.

దరఖాస్తు ప్రక్రియ:

ఈ నెల 17న కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుంది. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్ ద్వారా తమ వివరాలు సమర్పించాలి.

దరఖాస్తు సమర్పించే చివరి తేదీ: ఈ నెల 19.

గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా 2023-24 లో సాయం పొందిన లబ్ధిదారుల వివరాలు విశ్లేషణ జరపబడతాయి.

క్షేత్ర పరిశీలన ఈ నెల 22 నాటికి పూర్తి చేసి, తుది జాబితా ఈ నెల 24న సిద్ధం చేయబడుతుంది.

జాబితా రవాణా శాఖకు సమర్పించి, సీఎం చంద్రబాబు అక్టోబరు 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సాయం జమ చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories