Lockdown: ఆటో కార్మికులకు లాక్‌డౌన్ కష్టాలు

Auto Drivers Face Hardships Over Lockdown
x

Lockdown: ఆటో కార్మికులకు లాక్‌డౌన్ కష్టాలు

Highlights

Lockdown: కరోనా అన్ని రంగాలను కుదిపేస్తోంది. కూలీ దొరకుండా చేస్తోంది.

Lockdown: కరోనా అన్ని రంగాలను కుదిపేస్తోంది. కూలీ దొరకుండా చేస్తోంది. కూడు లేకుండా చేస్తోంది. నిరుపేదల కుటుంబాల్లో మంచినీళ్లే పరామన్నాలయ్యాయి. పస్తులు, అవస్థలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇటు ఆటో కార్మికులు సైతం దుర్భర జీవితాలను గడుపుతున్నారు. ఆటో తిరిగితేనే కడుపు నిండుతుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆటో చక్రాలు ఆగిపోయాయి. మినహాయింపు టైంలో అడ్డామీదకు వచ్చినా ఆటో ఎక్కేవారు లేరు. ఒకవేళ కిరాయి దొరికినా ఎక్కడ ఫైన్‌ పడుతుందో అని బిక్కుబిక్కుమంటున్నారు ఆటో డ్రైవర్లు తూర్పుగోదావరి జిల్లాలోని ఆటో డ్రైవర్ల దుస్థితిపై స్పెషల్‌ స్టోరీ.

కరోనా కాలంలో ఆటో డ్రైవర్ల జీవితాలు ముందుకు సాగని చక్రలయ్యాయి. ఆటో తిరిగితే ఆ కుంటుంబం పట్టెడన్నం తింటుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆటోలు షెడ్డులకే పరిమితం అయ్యాయి. మినహాయింపు టైంలో అడ్డామీదకు వచ్చినా ప్రయోజనం శూన్యం. కిరాయిలు దొరకడం లేదు. కరోనా భయంతో ఒకరు, ఇద్దర్ని మాత్రమే ఎక్కించుకోవాల్సి వస్తుంది. దీంతో ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని తూర్పుగోదావరి జిల్లాలోని ఆటో డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.

ఆటో తీసుకొని రోడ్డుమీదకు వస్తే వంద రూపాయలు సంపాదించడం గగనమైతోంది. నిత్యవసర సరుకులు, పెట్రోల్‌ ధరలేమో ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. మైలేజ్‌ రాక కిరాయిలు లేక ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 30 వేలకు పైగా మంది ఆటోకార్మికులు ఉన్నారు. కర్ఫ్యూ ఆంక్షాలు వీరి కడుపు మాడ్చేలా చేస్తున్నాయి. పూట గడవడమే కష్టమైపోతుంటే ఫైనాన్స్ వేధింపులు కూడా వెంటాడుతున్నాయి. ప్రతి నెలా ఫైనాన్స్ చెల్లించకపోతే వడ్డీలతోవాయిస్తున్నారని ఆటో డ్రైవర్లు అల్లాడిపోతున్నారు.

ఇన్నేసి కష్టాలతో నెట్టుకస్తున్న ఆటోడ్రైవర్లను ట్రాఫిక్స్ నిబంధనలు నిండా ముంచుతున్నాయి. ఏ చిన్న రూల్‌ అతిక్రమించినా 5 వందల రూపాయాలకు పైగా పెనాల్టీ పడిపోతుంది. అసలే చాలి చాలని సంపాదన పిల్లలకు ఏం పెట్టాలి. మేము ఏం తినాలి.. ఫైన్‌లు ఎలా కట్టాలని వాపోతున్నారు ఆటో డ్రైవర్లు. గత ఏడాది చేసినా అప్పులే ఇంకా తీరలేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. ఏం చేయాలో తెలియక ఆటో డ్రైవర్లు మదన పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, చలానాల నుంచి విముక్తి కలిగించాలని కోరుకుంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories