AP Group 2: గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!

AP Group 2: గ్రూప్-2 అభ్యర్ధులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్!
x
Highlights

AP Group 2: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 నోటిఫికేషన్‌పై నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి.

AP Group 2: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 నోటిఫికేషన్‌పై నెలకొన్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. గ్రూప్-2 పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. దీంతో నియామక ప్రక్రియ ముందడుగు వేయడానికి మార్గం సుగమమైంది.

అసలేం జరిగిందంటే?

2023లో విడుదలైన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు స్పోర్ట్స్ కోటా కింద కేటాయించిన రిజర్వేషన్ పాయింట్లు (రోస్టర్ పాయింట్లు) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్ల కేటాయింపులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరారు.

ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం, పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. రిజర్వేషన్ల కేటాయింపులో చట్టవిరుద్ధం ఏమీ లేదని భావిస్తూ, ఆ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు తీర్పుతో గత కొంతకాలంగా ఆందోళనలో ఉన్న వేలాది మంది అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో తదుపరి నియామక ప్రక్రియను ఏపీపీఎస్సీ వేగవంతం చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories