Botsa Satyanarayana: నన్ను హత్య చేసేందుకు కుట్ర.. బొత్స సంచలన వ్యాఖ్యలు

Botsa Satyanarayana
x

Botsa Satyanarayana: నన్ను హత్య చేసేందుకు కుట్ర.. బొత్స సంచలన వ్యాఖ్యలు 

Highlights

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు.

Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

బొత్స మాట్లాడుతూ, ఈ విషయంపై తాను గవర్నర్‌కి, చీఫ్ సెక్రటరీ (CS)‌కి లేఖ రాస్తానని తెలిపారు. పైడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా వైసీపీ నేతలు కూర్చున్న వేదిక ఆకస్మాత్తుగా కూలిపోయిన ఘటనపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు.

“ఆ వేదిక ఎందుకు కూలింది? ఎలా జరిగింది? దీని వెనుక ఎవరు ఉన్నా వారిని బయటకు తీస్తా,” అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories