ఇండియాకు అదే గొప్ప వరం.. ఇంకో 40 ఏళ్లు సమస్యే లేదు - చంద్రబాబు

Chandrababu Naidu speech in Madras IIT on all india research scholars summit 2025
x

Chandrababu Naidu speech in IIT Madras: ఇండియాకు అదే గొప్ప వరం.. ఇంకో 40 ఏళ్లు సమస్యే లేదు - మద్రాస్ ఐఐటిలో చంద్రబాబు స్పీచ్ 

Highlights

Chandrababu Naidu speech in IIT Madras: ఇండియాకు అదే గొప్ప వరం.. ఇంకో 40 ఏళ్లు సమస్యే లేదు - మద్రాస్ ఐఐటిలో చంద్రబాబు స్పీచ్

Chandrababu Naidu about India's demography: మద్రాస్ ఐఐటిలో నిర్వహించిన ఆల్ ఇండియా రిసెర్చ్ స్కాలర్స్ సమిట్ 2025 ఈవెంట్‌కు ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి స్టూడెంట్స్ ప్రారంభించిన స్టార్టప్స్ 80 శాతం సక్సెస్ అవుతున్నాయని అన్నారు. 1991 లో ప్రపంచవ్యాప్తంగా భారత్‌తో పాటు సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాల్లో తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించారు.

అప్పట్లో సంస్కరణలు తీసుకురావడం అనేది ఒక ఆప్షన్ కాకుండా అది ఒక తప్పనిసరి అవసరం ఏర్పడిందని అన్నారు. ఆ సంస్కరణలే ఆయా దేశాలను ఆర్థికంగా అభివృద్ధి బాటలో వెళ్లేలా చేశాయన్నారు. ఇండియా కూడా ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాతే అభివృద్ధిలోకి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ఈ ఐఐటి కాలేజీల స్థాపించడం కూడా విద్యా వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా వచ్చిందేనని చెబుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

వాజ్‌పేయికి నివేదిక ఇచ్చాను

1990 లలో కమ్యునికేషన్ సెక్టార్‌లో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ సంస్థలదే హవా నడిచేది. అదే సమయంలో చైనా స్మార్ట్ ఫోన్ల వినియోగంతో అభివృద్ధిలో దూసుకెళ్తోంది. అలాంటి సమయంలో తను చేసిన సిఫార్సు మేరకే అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి టెలికాం రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తరువాత టెలికాం రంగంలోకి ప్రైవేటు కంపెనీలు రావడం ఒక గేమ్ చేంజర్‌గా నిలిచిందన్నారు. దాంతో కమ్యునికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని అన్నారు.

భారత్ అభివృద్ధి గురించి మాట్లాడుతూ గత కొన్నేళ్లలో భారత్ ఆర్థికంగా 10వ స్థానం నుండి 5వ స్థానానికి చేరుకుందన్నారు. భారత్‌కు ఉన్న గొప్ప అవకాశం దేశ జనాభానే అని అన్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు జనాభాలేమి సమస్యను ఎదుర్కుంటున్నాయి. కానీ భారత్ వద్ద జనాభాకు, మానవ వనరులకు కొదువ లేదన్నారు. ఆ విషయంలో రాబోయే ఇంకో 40 ఏళ్ల వరకు భారత్ కు సమస్యే లేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories