Chandrababu: ఏపీలో సైకో పాలన సాగుతోంది..

Chandrababu: సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Arun Chilukuri
Updated on: 2 Dec 2022 7:30 PM IST
Chandrababu Slams Jagan in Public Meeting Nidadavolu
X

Chandrababu: ఏపీలో సైకో పాలన సాగుతోంది..

Chandrababu: సీఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబుకు ఆపార్టీ శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. ఏపీలో సైకో పాలన సాగుతోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ఎత్తేయడం, ప్రశ్నిస్తే దాడులు చేయడం వంటి పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ ఇదేం ఖర్మ అంటున్నారని గుర్తు చేశారు. జగన్ రెడ్డి హయాంలో ఊరికోసైకో తయారవుతున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలోని 7 మండలాలను ఏపీలో కలిపిన ఘటన తనదేనన్నారు. ఏ తప్పూ లేకపోయినా అమరరాజా బ్యాటరీస్‌‎పై కేసులు పెట్టడం వల్లే కోట్ల పెట్టుబడులు తరలిపోయాయన్నారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరాన్ని జగన్ పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story