Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్‌ కత్తిరించి ప్రయాణికులపై దాడి!

Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్‌ కత్తిరించి ప్రయాణికులపై దాడి!
x

Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్‌ కత్తిరించి ప్రయాణికులపై దాడి!

Highlights

ముంబై నుండి చెన్నై వెళ్లే చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది.

Chengalpattu Express Robbery: ముంబై నుండి చెన్నై వెళ్లే చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ దోపిడీ జరిగింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు సిగ్నల్ వ్యవస్థకు చెందిన కేబుల్‌ను పథకం ప్రకారం కత్తిరించడంతో రైలు ఆగిపోయింది. ఆ సమయంలోనే దుండగులు బోగీల్లోకి ప్రవేశించి ప్రయాణికులను కత్తులతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు లాక్కున్నారు.

ఈ ఘటనలో అత్యంత భయాందోళనకు గురైన ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, 22159 రైలు యస్-1 బోగీలో ప్రయాణిస్తున్న విశాలాక్షి అనే మహిళ మెడ నుండి దుండగులు 27 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇంతలోనే మరో దోపిడీ చెన్నై ఎగ్మోర్‌ ట్రైన్ (17654)లో చోటు చేసుకుంది. రామలింగయ్యపల్లి స్టేషన్‌లో ట్రైన్ క్రాసింగ్ కోసం ఆగిన సమయంలో, ఓ దొంగ ట్రైన్ కదలడం ప్రారంభించిన వెంటనే దివ్యభారతి అనే ప్రయాణికురాలి మెడలో ఉన్న 30 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఆమెతో పాటు మరికొందరికి కూడా ఇదే తరహాలో దోపిడీ జరిగిందని సమాచారం. బాధితులు రైల్వే పోలీసులకు సమాచారం అందించగా, దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ ఘటనలతో రైలు ప్రయాణాల భద్రతపై ప్రయాణికులలో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా వ్యవస్థపై మళ్లీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories