SSC Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..టైమ్, రూల్స్ ఇవే

Class 10 exams from today time and rules are as follows
x

 SSC Exams 2025: నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..టైమ్, రూల్స్ ఇవే

Highlights

SSC Exams 2025: ఏపీలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఈ పరీక్షలకు 6,19,275 మంది...

SSC Exams 2025: ఏపీలో పదో తరగతి పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఈ పరీక్షలకు 6,19,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. పరీక్షకేంద్రాల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, పేపర్ లీక్ కాకుండా 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్ విధించింది. ఎగ్జామ్ ఉదయం 9.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగుతాయి. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సారి పదోతరగతి పరీక్షల కోసం 3450 కేంద్రాలను ఏర్పాటు చేశారు.


ఈ పరీక్షల కోసం విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ పరీక్ష కేంద్రాలకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న ఈపరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సిట్టింగ్ స్క్వాడ్ , ఫ్లైయింగ్ స్వాడ్ లను ఏర్పాటు చేసింది విద్యాశాఖ. విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే సమయంలో హాల్ టికెట్ పోగొట్టుకున్నా, లేక మర్చిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని ఇందుకోసం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కేటాయించింది. ఈ(95523 00009) వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచారు. అదే విధంగా 08662874540 హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories