CM Chandrababu Naidu: కన్నయ్యనాయుడిని సన్మానించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: 30 టీఎంసీల నీరు వృథా కాకుండా అడ్డుకున్న కన్నయ్యనాయుడు

Shashank Gullapelli
Updated on: 21 Aug 2024 6:00 PM IST
Cm Chandrababu Honored Crest Gate Expert Kannayya Naidu
X

CM Chandrababu Naidu: కన్నయ్యనాయుడిని సన్మానించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu: సాగునీటి రంగ నిపుణులు కన్నయ్యనాయుడుని ఏపీ సీఎం చంద్రబాబు సన్మానించారు. శాలువా కప్పి జ్ఞాపిక అందించి అభినందించారు. ఇటీవల తుంగభద్ర జలాశయం 19వ గేటు కొట్టుకుపోగా.. కన్నయ్యనాయుడు అక్కడి పరిస్థితిని గాడిన పెట్టేందుకు వెళ్లారు. వరద ప్రవాహం కొనసాగుతుండగానే స్టాప్ లాక్ గేట్ ఏర్పాటును విజయవంతం చేశారు. సుమారు 30 టీఎంసీల నీరు వృథా కాకుండా అడ్డుకోగలిగి సాహసోపేతంగా సమస్యను పరిష్కరించారు. ఈ నేపథ్యంలో కన్నయ్యనాయుడిని సచివాలయానికి పిలిచిన సీఎం.. రైతుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story