Chandrababu: రైతులకు చంద్రబాబు భరోసా.. అవినీతి లేని పట్టా.. క్యూఆర్ కోడ్ పాసుపుస్తకాల పంపిణీ!

Chandrababu: రైతులకు చంద్రబాబు భరోసా.. అవినీతి లేని పట్టా.. క్యూఆర్ కోడ్ పాసుపుస్తకాల పంపిణీ!
x

Chandrababu: రైతులకు చంద్రబాబు భరోసా.. అవినీతి లేని పట్టా.. క్యూఆర్ కోడ్ పాసుపుస్తకాల పంపిణీ!

Highlights

Chandrababu: గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Chandrababu: గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ, ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా కొత్తబురుజులో జరిగిన గ్రామసభలో పాల్గొన్న ఆయన, రైతులకు క్యూఆర్ (QR) కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

భూ రికార్డుల్లో పారదర్శకత.. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు

వైసీపీ తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని సీఎం గుర్తుచేశారు. "భూ రికార్డులు తారుమారు కాకుండా పక్కాగా పట్టాలివ్వడమే మా లక్ష్యం. ఒక్క పైసా అవినీతి లేకుండా రైతులకు పట్టా ఇప్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే. సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాతే కొత్త పాసుపుస్తకాలు ఇస్తున్నాం" అని ఆయన హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వ హయాంలో అంతా కల్తీ మయం అయిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు.

ఆరోగ్యంతో ఆటలా: కల్తీ మద్యంతో వేల మంది పేదల ప్రాణాలు తీశారని, వారికి పేదవాడి ఆరోగ్యం కంటే డబ్బే ముఖ్యమైందని ధ్వజమెత్తారు.

తిరుమల పవిత్రత: తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని సైతం కల్తీ చేసి పవిత్రతను దెబ్బతీశారని, స్వామివారిని అపవిత్రం చేయాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

రౌడీయిజం వద్దు.. ప్రశాంతతే ముద్దు!

ముఠా కక్షలు, రౌడీయిజం లేని రాయలసీమను చూడాలన్నదే తన ఆకాంక్ష అని సీఎం పేర్కొన్నారు. "ముఠాలు వద్దు.. గ్రామాల ప్రశాంతతే ముద్దు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ఈ ప్రాంతాన్ని ఉద్యానవన హబ్‌గా తీర్చిదిద్ది, ఇక్కడి ఉత్పత్తులకు ప్రపంచస్థాయిలో మార్కెట్ కల్పిస్తాం" అని భరోసా ఇచ్చారు. కుట్రపూరితంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories