Rains: రాష్ట్రంలో అకాల వర్షాలు.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం

Rains: రాష్ట్రంలో అకాల వర్షాలు.. శుభవార్త చెప్పిన ప్రభుత్వం
x
Highlights

Rains: ఏపీలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ధాన్య పంటలు, హార్టికల్చర్ పంటలు, తోటలు, మిర్చి, పత్తి వంటి...

Rains: ఏపీలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వర్షాలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. ధాన్య పంటలు, హార్టికల్చర్ పంటలు, తోటలు, మిర్చి, పత్తి వంటి పంటలు బారీగా దెబ్బతిన్నాయి. రైతులు పండించిన పంట చేతికి రాకముందే నాశనమై తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించారు. ఉన్నతాధికారులత సమీక్ష నిర్వహించారు.

ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోవడం బాధాకరమన్నారు. తక్షణ సాయంతో పాటు దీర్ఘకాలిక పరిష్కారాలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కడప, అనంతపురం, శ్రీ సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో వడగళ్ల వర్షాలు, అకాల వర్షాలు మారు తుపానుల్లా దాడి చేశాయి. ఈ ప్రభావం వల్ల 10 మండలాల్లో 40 గ్రామాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

1364 మంది రైతులు పంట నష్టపోయారు. 1670 హెక్టార్ల హార్టికల్చర్ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అరటి, మామిడి, పైనాపిల్, టమాటా, మిర్చి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకు సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సహా స్కీములను మరింత వేగంగా అమలు చేయాలన్నారు. నష్టపోయిన ప్రతిరైతుకు న్యాయం జరగాలని చూస్తామన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం అందించేందుకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతుల భవిష్యత్తును కాపాడేందుకు పంటల బీమా, కొత్త రుణ సదుపాయాలు, తక్షణ ఆర్ధిక సాయం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories